Breaking News

గిల్‌, రాహుల్‌ విధ్వంసం.. టీమిండియా ఘన విజయం

Published on Sat, 06/13/2026 - 22:09

అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వర్షం అంతరాయంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. ఈ నేపథ్యంలో ఆఫ్గన్ విధించిన 195 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. 

భారత బ్యాటింగ్‌లో కెప్టెన్‌ శుబ్‌మన్ గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్‌) అజేయ ఇన్నింగ్స్‌తో యాంకర్ రోల్ పోషించాడు. చివర్లో కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్‌) ధనాదన్ ఇన్నింగ్స్‌తో తనదైన శైలిలో టీమిండియాకు విజయాన్ని అందించాడు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్‌ఖాన్‌, రెహమాన్ షరిఫీ చెరొక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్‌ 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది.

ఆఫ్గన్‌ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (102) శతకంతో అదరగొట్టాడు. హస్మతుల్లా (26),  భారత బౌలర్లలో హర్ష్‌దూబే, గుర్నూర్‌ బ్రార్‌ చెరో 3 వికెట్లు తీయగా, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్‌లు 2 వికెట్లు పడగొట్టారు. ఇరుజట్ల మధ్య రెండో వన్డే బుధవారం లక్నో వేదికగా జరగనుంది.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు