Breaking News

శుభ్‌మన్‌ గిల్ కీల‌క నిర్ణ‌యం

Published on Mon, 01/19/2026 - 10:34

టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్ వ‌రుస‌గా రెండో సిరీస్ ఓట‌మిని ఎదుర్కొన్నాడు. సొంత‌గ‌డ్డ‌పై న్యూజిలాండ్‌తో జ‌రిగిన మూడో వ‌న్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. గతేడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో కూడా మెన్ బ్లూ ఓడిపోయింది. గిల్ కెప్టెన్సీలో భారత్ కేవలం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను మాత్రమే సొంతం చేసుకుంది.

దీంతో గిల్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2026 జట్టులో చోటు ద‌క్కించుకోలేకపోయిన గిల్‌.. మ‌ళ్లీ దాదాపు ఏడు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ జాతీయ జ‌ట్టు త‌ర‌పున బ‌రిలోకి దిగ‌నున్నాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త్ వెళ్ల‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఐదు టీ20లు, మూడు వ‌న్డేల సిరీస్‌లో ఆతిథ్య జ‌ట్టుతో భార‌త త‌ల‌ప‌డ‌నుంది.

ఈ టూర్‌లో వ‌న్డే సిరీస్‌లో గిల్‌ జ‌ట్టును ముందుకు న‌డిపించ‌నున్నాడు. ఇప్పటికే టీ20 జట్టుకు అతడు దూరం అయ్యాడు కాబట్టి... ఈ టూర్‌ మొదలయ్యే వరకు గిల్ భార‌త్‌ త‌ర‌పున ఒక్క మ్యాచ్ కూడా ఆడే సూచ‌న‌లు క‌న్పించ‌డం లేదు. ఈ క్ర‌మంలో గిల్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. తన బ్యాటింగ్ స్కిల్స్‌ను మెరుగుప‌రుచుకోవ‌డానికి రంజీ ట్రోఫీ 2025-26 సీజ‌న్‌లో ఆడాల‌ని గిల్ నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. 

ఈ దేశ‌వాళీ టోర్నీ సెకెండ్ లీగ్‌లో పంజాబ్ ఆడే తొలి మ్యాచ్‌లో గిల్ బ‌రిలోకి దిగే అవ‌కాశ‌ముంది. జ‌న‌వ‌రి 22న రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో సౌరాష్ట్ర‌తో పంజాబ్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర త‌ర‌పున సీనియ‌ర్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా కూడా ఆడ‌నున్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో జడేజా అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లోనూ విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో త‌న ఫామ్‌ను తిరిగి అందుకోవడానికి జ‌డేజాకు రంజీ ట్రోఫీ కీల‌కం కానుంది. అవేవిధంగా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ కూడా హైద‌రాబాద్ జ‌ట్టు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.
చదవండి: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)