Breaking News

కెప్టెన్సీ తెచ్చిన జోష్‌.. శ్రేయ‌స్ అయ్య‌ర్ విధ్వంసం!

Published on Sun, 06/07/2026 - 07:59

టీమిండియా టీ20 కెప్టెన్‌గా ప్ర‌మోష‌న్ కొట్టేసిన శ్రేయ‌స్ అయ్య‌ర్ టీ20 ముంబై లీగ్‌లో త‌న బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. మొద‌ట మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అయ్య‌ర్ ఆ త‌ర్వాత కెప్టెన్‌గా త‌న జ‌ట్టును గెలిపించ‌డ‌మే గాక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. 

టోర్నీలో భాగంగా శ‌నివారం సూర్య‌కుమార్ సార‌థ్యంలోని ట్రంప్ నైట్స్ ఎంఎన్ఈ జ‌ట్టుపై శ్రేయ‌స్ అయ్య‌ర్ నేతృత్వంలోని ముంబై ఫాల్క‌న్స్ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రంప్ నైట్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 147 ప‌రుగులు చేసింది. కెప్టెన్ సూర్య‌కుమార్ (24 బంతుల్లో 48) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. నూత‌న్ కుమార్ (34) ప‌ర్వాలేద‌నిపించాడు. 

ఫాల్క‌న్స్ బౌల‌ర్ల‌లో ప్ర‌త‌మేశ్ డాకే 4 వికెట్లు తీశాడు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన ముంబై ఫాల్క‌న్స్ అయ్య‌ర్ విజృంభ‌ణ‌తో 16.4 ఓవ‌ర్ల‌లోనే 5 వికెట్లు కోల్పోయి 149 ప‌రుగులు చేసి విజ‌యాన్ని అందుకుంది. శ్రేయ‌స్ అయ్య‌ర్ (36 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. 

ట్రంప్ నైట్స్ బౌల‌ర్ల‌లో హితేశ్ క‌డ‌మ్ 2 వికెట్లు తీశాడు. మొత్తం మీద టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఎంపికైన రోజునే ముంబై టీ20లీగ్‌లోనూ శ్రేయ‌స్ విజృంభించ‌డం చూస్తుంటే కెప్టెన్సీ ఇచ్చిన ఆనందం రెట్టింపు అయింది. ఐపీఎల్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసిన బీసీసీఐ సూర్యకుమార్‌ను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను అయ్యర్‌కు అప్పగించింది.

ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ టూర్లతో పాటు ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన మూడు వేర్వేరు జట్లకు అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ కూడా మూడు జట్లలో చోటు సంపాదించి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు.

 

చదవండి: సూర్య‌ను తొల‌గించ‌డంపై రోహిత్ స్పందన!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)