Breaking News

'అత‌డితో జాగ్ర‌త్త‌'.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు వార్నింగ్‌

Published on Sat, 02/14/2026 - 17:49

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భార‌త్-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. హై-వోల్టేజ్ పోరుకు ముందు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ స్పిన్న‌ర్ ఉస్మాన్ తారిఖ్‌ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌వ‌ద్ద‌ని భార‌త జ‌ట్టును భ‌జ్జీ హెచ్చ‌రించాడు.

ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భార‌త్ గెలుస్తుంద‌ని నేను అనుకుంటున్నాను. కానీ పాకిస్తాన్ జ‌ట్టులో ఉస్మాన్ తారిక్ లాంటి అద్భుత‌మైన స్పిన్న‌ర్ ఉన్నాడు. అత‌డిని భార‌త బ్యాట‌ర్లు జాగ్ర‌త్త‌గా ఆడాలి. అయితే మ‌న జ‌ట్టుపై పూర్తి న‌మ్మ‌కం నాకు ఉంది. భారత జట్టు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది. టీమిండియా ఎప్ప‌టిలాగే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడి గెలుపు జెండా ఎగ‌ర‌వేస్తార‌ని ఆశిస్తున్నాము అని ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు.

కాగా ఉస్మాన్ తారిఖ్ త‌న బౌలింగ్ యాక్ష‌న్‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. అత‌డి బౌలింగ్‌ను ఆర్ధం చేసుకునేందుకు బ్యాట‌ర్లు తెగ ఇబ్బంది ప‌డుతున్నారు. బంతిని విసిరే ముందు కొద్దిసేపు ఆగి  డెలివరీ చేసే అతడి  బౌలింగ్ శైలి కేదార్ జాదవ్‌ను త‌ల‌పిస్తోంది. అత‌డి బౌలింగ్ యాక్ష‌న్‌పై వివాదాలు త‌లెత్తిన‌ప్ప‌టికి.. ఐసీసీ మాత్రం క్లియ‌రెన్స్ ఇచ్చింది. తారిఖ్ ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం 4 టీ20 మ్యాచ్‌లు మాత్ర‌మే ఆడి 11 వికెట్లు ప‌డ‌గొట్టాడు. పాక్ జ‌ట్టు కూడా అత‌డిపైనే గంపెడు ఆశ‌లు పెట్టుకుంది.
చ‌ద‌వండి: T20 WC 2026: భార‌త ఆట‌గాళ్ల‌తో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)