Breaking News

సిక్సర్ల వర్షం​ కురిపించిన పూరన్‌.. సౌతాఫ్రికాను క్లీన్‌ స్వీప్‌ చేసిన వెస్టిండీస్‌

Published on Wed, 08/28/2024 - 07:26

సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను వెస్టిండీస్‌ 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. నిన్న (ఆగస్ట్‌ 27) జరిగిన నామమాత్రపు మూడో టీ20లో విండీస్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిన 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో మ్యాచ్‌ను అక్కడితో ఆపేశారు. 

అనంతరం వర్షం తగ్గుముఖం పట్టాక డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిన విండీస్‌ లక్ష్యాన్ని 13 ఓవర్లలో 116 పరుగులుగా నిర్ధారించారు. 116 పరుగుల లక్ష్యాన్ని విండీస్‌ కేవలం 9.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

రాణించిన షెపర్డ్‌
తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా.. రికెల్టన్‌ (27), మార్క్రమ్‌ (20), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (40) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో రొమారియో షెపర్డ్‌ పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు రెండు వికెట్లు తీసి రాణించాడు. అకీల్‌ హొసేన్‌, మాథ్యూ ఫోర్డ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్‌ దుబారాగా బంతులు వేస్ట్‌ చేశాడు. హెండ్రిక్స్‌ 20 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఆఖర్లో స్టబ్స్‌ వేగంగా పరుగులు చేయడంతో సౌతాఫ్రికా 100 పరుగుల మార్కును దాటగలిగింది. విండీస్‌ బౌలర్లలో రోస్టన్‌ ఛేజ్‌ తన కోటా రెండు ఓవర్లలో ఓ మెయిడిన్‌ వేశాడు.

సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్‌
109 పరుగుల ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. నికోలస్‌ పూరన్‌ (13 బంతుల్లో 35; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్‌ హోప్‌ (24 బంతుల్లో 42 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు), షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (17 బంతుల్లో 31 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) చెలరేగడంతో సునాయాసంగా విజయతీరాలకు చేరింది. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో పూరన్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సిరీస్‌లో అతను 205.17 స్ట్రయిక్‌రేట్‌తో 12 సిక్సర్లు బాదాడు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)