Breaking News

రికార్డులు కొల్లగొట్టిన హోప్‌

Published on Wed, 11/19/2025 - 19:29

వెస్టిండీస్‌ సంచలన బ్యాటర్‌ షాయ్‌ హోప్‌ (Shai Hope) వన్డే క్రికెట్‌లో రికార్డుల మీద రికార్డును నమోదు చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో ఇవాళ (నవంబర్‌ 19) జరిగిన వన్డేలో సుడిగాలి శతకం బాదిన అతడు.. వేర్వేరు విభాగాల్లో పలు రికార్డులు సాధించాడు. 

ఈ మ్యాచ్‌లో మహోగ్రరూపం దాల్చిన హోప్‌ కేవలం 69 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో హోప్‌ ఖాతాలో ఈ కింది రికార్డులు చేరాయి.

  • ఈ ఏడాది విండీస్‌ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు.

  • ఈ సెంచరీ హోప్‌కు వన్డేల్లో 19వది. తద్వారా క్రిస్‌ గేల్‌ (25) తర్వాత అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్‌ బ్రియాన్‌ లారా (19) రికార్డు సమం.

  • 19 శతకాలను హోప్‌ కేవలం 142 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించాడు. తద్వారా బాబర్‌ ఆజమ్‌ (102), హాషిమ్‌ ఆమ్లా  (104), విరాట్‌ కోహ్లి (124), డేవిడ్‌ వార్నర్‌ (139) తర్వాత అత్యంత వేగంగా ఈ శతకాల మైలురాయిని తాకిన ఆటగాడిగా రికార్డు.

  • ఈ 19 శతకాలను హోప్‌ 12 వేర్వేరు దేశాలపై సాధించాడు. భారత్‌, బంగ్లాదేశ్‌పై అత్యధికంగా తలో 3 సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్‌పై హోప్‌కు ఇదే తొలి వన్డే సెంచరీ.

  • ఈ సెంచరీతో హోప్‌ ఈ దశాబ్దంలో (2015-2025) అత్యధిక సెంచరీలు చేసిన తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. తద్వారా బాబర్‌ ఆజమ్‌ (9), డికాక్‌ (8), కోహ్లి (8), గుర్బాజ్‌ (8), గిల్‌ను (8) మరింత వెనక్కు నెట్టాడు.  

  • ఈ ఇన్నింగ్స్‌తో హోప్‌ వన్డేల్లో 6000 పరుగుల మైలురాయిని తాకాడు. ఈ మార్కును తాకేందుకు అతనికి 142 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. తద్వారా గ్రేట్‌ వివ్‌ రిచర్డ్స్‌ (141) తర్వాత అత్యంత వేగంగా 6000 పరుగుల మార్కును తాకిన విండీస్‌ ఆటగాడిగా రికార్డు.

హోప్‌ ఒక్క ఇన్నింగ్స్‌తో ఇన్ని రికార్డులు సాధించినా ఈ మ్యాచ్‌లో విం​డీస్‌ పరాజయంపాలవడం విచారకరం. ఈ పరాజయంతో విండీస్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే కోల్పోయింది. నేపియర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

చదవండి: వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)