Breaking News

స్లో బంతుల వెనుక 16 ఏళ్ల కథ!

Published on Wed, 03/11/2026 - 12:42

జస్‌ప్రీత్‌ బుమ్రా.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్త, పాత బంతి అనే తేడా లేకుండా తన వైవిధ్యమైన బౌలింగ్‌ యాక్షన్‌తో డెత్‌ ఓవర్ల బౌలింగ్‌ స్పెషలిస్ట్‌గా తయారయ్యాడు. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలవడమే గాక జట్టు టైటిల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌, న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌ సందర్భంగా డెత్‌ ఓవర్లలో తన విలువేంటో మరోసారి నిరూపిస్తూ భారత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. తనకు మాత్రమే సాధ్యమైన స్లో డెలివరీలతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టడమే గాక వికెట్లు పడగొట్టడంలోనూ విజయ వంతమయ్యాడు. మరి బుమ్రా స్లో బంతుల వెనుక దాగున్న కథాకమీషును ఒకసారి పరిశీలిద్దాం. బుమ్రా స్లో డెలివరీ కథ తెలియాలంటే 16 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సిన అవసరముంది.

అహ్మదాబాద్‌ వేదికగా కిషోర్‌ త్రివేదీ క్రికెట్‌ కోచింగ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. 16 ఏళ్ల వయసులో బుమ్రా తొలిసారి త్రివేదీ కోచింగ్‌ సెంటర్‌కు వచ్చాడు. అయితే ఆ సమయంలో బుమ్రాకు క్రికెట్‌ పట్ల ఇంట్రెస్ట్‌ చూపేవాడు కాదు. కానీ అతని బౌలింగ్‌లో ఏదో తెలియని వైవిధ్యాన్ని కిశోర్ త్రివేదీ ఆనాడే కనిపెట్టాడు. బుమ్రా బంతులు వేయడానికి ముందు రనప్‌కు కొంత దూరమే తీసుకోవడం.. కొంత పరిగెత్తడం, కొంత నడవడం చేయడం వింతగా అనిపించింది. అంతేకాదు బంతిని బాగా బౌన్స్‌ వేసేవాడు. దీంతో కిశోర్‌ త్రివేది కోచింగ్‌ సెంటర్‌లో ఉన్న మిగతా పిల్లలు బుమ్రా బౌలింగ్‌ చూసి భయపడిపోయేవారు. బంతిని విడుదల చేసే పాయింట్ క్లిష్టంగా ఉండడంతో ఇతర పేసర్ల మాదిరిగా కాకుండా కాస్త భిన్నంగా ఉండడంతో బ్యాటర్లు తరచూ ఇబ్బంది పడేవారు. 

కోచ్‌ మాటలు పాటించి..
బౌన్సర్లు తగ్గించి స్వింగ్‌, యార్కర్లపై దృష్టి పెడితే భవిష్యత్తులో మంచి బౌలర్‌గా ఎదిగే అవకాశముంటుందని కోచ్‌ కిశోర్‌ బుమ్రాకు సలహా ఇచ్చాడు. కోచ్‌ మాటలను తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చిన బుమ్రా కాలక్రమంలో తన బౌలింగ్‌లో బౌన్సర్లు తగ్గించుకొని యార్కర్లు ఎక్కువగా వేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బంతిని స్వింగ్‌ చేసే కళను కూడా ఒంటబట్టించుకున్నాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన బుమ్రా తన మీడియం స్లో  బౌలింగ్‌తో చేస్తున్న అద్భుతాలను కళ్లారా చూస్తూనే ఉన్నాం.

తొలి పరిచయం!
బుమ్రా వైవిధ్యమైన బౌలింగ్‌ యాక్షన్‌పై అతని చిన్ననాటి కోచ్‌ కిశోర్‌ త్రివేది స్పందించారు. ‘16 ఏళ్ల వయసులో బుమ్రాను తొలిసారి చూశాను. చూసినప్పుడే బుమ్రా బౌలింగ్‌లో ఒక వైవిధ్యత కనిపించింది. బౌలింగ్‌ యాక్షన్‌ మార్చుకోమని ఆనాడే చెప్పి ఉంటే బుమ్రా ఇవాళ ఒక సాధారణ స్థాయి బౌలర్‌గా మిగిలిపోయేవాడు. బుమ్రాది ఒక యూనిక్‌ బౌలింగ్‌ యాక్షన్‌. స్లో ఆర్థడాక్స్‌ను మీడియం బౌలింగ్‌కు మిక్స్‌ చేస్తూ బంతులను విడుదల చేయడం కాస్త కఠినతరంగా ఉంటుంది. కానీ బుమ్రా దీనిని చక్కగా ఒంటబట్టించుకున్నాడు. బుమ్రాకు అది సహజత్వంగా రావడంతో బౌన్స్‌ను తగ్గించుకొని యార్కర్లపై దృష్టి సారించాలని చెప్పాను. ఇవాళ బుమ్రా స్థాయి ఏంటో మీ అందరికీ తెలిసిందే’ అంటూ పేర్కొన్నారు.

ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా 8మ్యాచ్‌లాడి 14 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా  బుమ్రా తన అంతర్జాతీయ కెరీర్‌లో 52 టెస్టుల్లో 234 వికెట్లు, 89 వన్డేల్లో 149 వికెట్లు, 95 టీ20ల్లో 121 వికెట్లు పడగొట్టాడు. 2024, 2026 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులోనూ బుమ్రా సభ్యుడిగా ఉన్నాడు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)