బంగ్లాదేశ్‌ ఆడకపోతే స్కాట్లాండ్‌కు అవకాశం! 

Published on Tue, 01/20/2026 - 05:33

టి20 ప్రపంచ కప్‌లో తాము ఆడే మ్యాచ్‌లను భద్రతాకారణాలతో భారత్‌ నుంచి శ్రీలంకకు తరలించాలంటూ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) చేస్తున్న డిమాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో మ్యాచ్‌ల వేదిక మార్పు సాధ్యం కాదని ఐసీసీ పదేపదే చెబుతున్నా... బీసీబీ మాత్రం తమ మంకు పట్టును వీడటం లేదు. దీంతో ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నెల 21న దీనిపై ఐసీసీ స్పష్టమైన ప్రకటన ఇవ్వనుంది. 

తాము వరల్డ్‌ కప్‌ ఆడాలా లేదా అనేది బంగ్లాదేశ్‌ ఆలోపు నిర్ణయం తీసుకోవాలని ఐసీసీ హెచ్చరించింది. లేదంటే టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పించి ప్రస్తుత ఐసీసీ ర్యాంకింగ్స్‌ ప్రకారం తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్‌కు అవకాశం ఇస్తామని కూడా చెప్పేసింది. తమ గ్రూప్‌ను మార్చి ఐర్లాండ్‌ మ్యాచ్‌ల స్థానంలో శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడించాలని బీసీబీ చేసిన ప్రత్యామ్నాయ ప్రతిపాదనకు కూడా అంగీకరించేది లేదని ఐసీసీ జవాబిచి్చంది. భారత్‌–శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న టి20 ప్రపంచకప్‌ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.    

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)