Breaking News

వారిని డబ్బు అడుగుతున్న సర్ఫరాజ్‌ తండ్రి?! నిజం ఇదీ..

Published on Wed, 03/06/2024 - 12:28

తన గురించి సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై టీమిండియా యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ తండ్రి నౌషద్‌ ఖాన్‌ స్పందించాడు. తన పేరిట నకిలీ ఖాతాలు తెరిచి కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డాడు.

యువ క్రికెటర్లు ఎవరూ కూడా ఈ మోసగాళ్ల వలలో చిక్కవద్దని.. తాను ఏ జట్టుకు కూడా కోచ్‌గా వ్యవహరించడం లేదని నౌషద్‌ ఖాన్‌ స్పష్టం చేశాడు. కాగా తన ఇద్దరు కుమారులు సర్ఫరాజ్‌ ఖాన్‌, ముషీర్‌ ఖాన్‌లను టీమిండియాకు ఆడించాలన్నది నౌషద్‌ కల.

ఇందుకోసం వారిద్దరిని చిన్ననాటి నుంచే ఆ దిశగా ప్రోత్సహించి.. అనేక కష్టనష్టాలకోర్చి కోచ్‌గా శిక్షణనిచ్చి మెంటార్‌గా మార్గదర్శనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్‌, ముషీర్‌ దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి తండ్రి పేరును నిలబెడుతున్నారు.

అంచెలంచెలుగా ఎదిగి.. ముషీర్‌ ఖాన్‌  ఇటీవల అండర్‌-19 వరల్డ్‌కప్‌లో అదరగొట్టగా.. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సర్ఫరాజ్‌ ఖాన్‌ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగా రాజ్‌కోట్‌లో టీమిండియా క్యాప్‌ అందుకున్నాడు. ఆ సమయంలో నౌషద్‌ ఖాన్‌ కూడా కొడుకు పక్కనే ఉండి కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు అభిమానుల మనసును మెలిపెట్టాయి.

ఈ క్రమంలో సర్ఫరాజ్‌తో పాటు నౌషద్‌ ఖాన్‌ పేరు కూడా నెట్టింట మారుమ్రోగింది. ఈ నేపథ్యంలో.. ‘‘డబ్బులు కడితే ఐపీఎల్‌లో నెట్‌ బౌలర్లుగా లేదంటే దేశవాళీ క్రికెట్లో ఆడే ఛాన్సులు ఇప్పిస్తాం’’ అని నౌషద్‌ ఖాన్‌ పేరిట ప్రకటనలు రాగా.. అతడు తాజాగా స్పందించాడు.

ఈ మేరకు.. ‘‘నా పేరు మీద ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో అనేక మంది నకిలీ ఖాతాలు సృష్టించి.. ఐపీఎల్‌ నెట్‌బౌలర్లుగా, రాష్ట్రస్థాయి క్రికెటర్లుగా, అకాడమీ సెలక్షన్‌ విషయంలో సాయం చేస్తామంటూ డబ్బు అడుగుతున్నారు.

దయచేసి వీటిని ఎవరూ నమ్మకండి. మీ ప్రతిభ, హార్డ్‌వర్క్‌పైనే నమ్మకం ఉంచండి. నాకు ఏ ఐపీఎల్‌ జట్టుతోనూ సంబంధం లేదు. అదే విధంగా నేను ఏ జట్టుకు కూడా కోచింగ్‌ ఇవ్వడం లేదు. నకిలీ ప్రచారాలను నమ్మకండి. థాంక్యూ’’ అని నౌషద్‌ ఖాన్‌ ఓ వీడియో విడుదల చేశాడు.

ఇదిలా ఉంటే.. సర్ఫరాజ్‌ ఖాన్‌ ప్రస్తుతం ధర్మశాలలో ఇంగ్లండ్‌తో జరుగనున్న ఆఖరిదైన నామమాత్రపు ఆఖరి టెస్టుకు సిద్ధమవుతున్నాడు. ఇక రోహిత్‌ సేన ఇప్పటికే ఈ సిరీస్‌ను 3-1తో గెలిచిన విషయం తెలిసిందే.

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)