Breaking News

కొడుకు 6 వారాల్లో 10 కిలోలు తగ్గితే.. తండ్రి ఆర్నెళ్లలో 38 కేజీలు ఉఫ్‌!

Published on Mon, 10/13/2025 - 17:12

సర్ఫరాజ్‌ ఖాన్‌ (Sarfraz Khan)ను టీమిండియాకు ఆడే స్థాయికి చేర్చడంలో అతడి తండ్రి నౌషద్‌ ఖాన్‌ (Naushad Khan)ది కీలక పాత్ర. పెద్ద కొడుకు సర్ఫరాజ్‌తో పాటు చిన్నోడు ముషీర్‌ ఖాన్‌ను తన శిక్షణలో రాటుదేలేలా చేశాడు నౌషద్‌. తానే స్వయంగా కోచింగ్‌ ఇస్తూ ఇద్దరు కుమారులను మేటి క్రికెటర్లుగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్నాడు.

అధిక బరువు, ఫిట్‌నెస్‌ లేమి
అయితే, ముంబై తరఫున రంజీల్లో పరుగుల వరద పారించినా సర్ఫరాజ్‌ ఖాన్‌కు టీమిండియా ఎంట్రీ అంత సులువేం కాలేదు. ముఖ్యంగా అతడి అధిక బరువు, ఫిట్‌నెస్‌ లేమిపై తరచూ విమర్శలు వచ్చేవి. ఎట్టకేలకు గతేడాది టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ ఇప్పటికి ఆరు టెస్టులు ఆడి 371 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం.

ఆరువారాల్లోనే ఏకంగా పది కిలోల బరువు తగ్గి
అయితే, ఆస్ట్రేలియా పర్యటనతో పాటు ఇంగ్లండ్‌ టూర్‌లోనూ సెలక్టర్లు సర్ఫరాజ్‌ను పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి సారించిన 27 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ కేవలం ఆరువారాల్లోనే ఏకంగా పది కిలోల బరువు తగ్గడం విశేషం. మొత్తంగా రెండునెలల్లోనే 17 కిలోలు తగ్గిపోయాడు. ఇందుకు ప్రధాన కారణం అతడి తండ్రి నౌషద్‌ ఖాన్‌.

కుమారులకు కోచ్‌గా ఉన్న నౌషద్‌ ఖాన్‌.. ఫిట్‌నెస్‌ విషయంలోనూ వారికి ఆదర్శంగా ఉండాలని భావించాడు. అందుకే సర్ఫరాజ్‌తో కలిసి కఠినమైన డైట్‌ పాటించి ఆరు నెలల్లోనే ఏకంగా 38 కిలోల బరువు తగ్గాడు. 122 కేజీల బరువు నుంచి 84 కిలోలకు చేరుకుని గుర్తు పట్టనంతగా మారిపోయాడు. ఈ క్రమంలో నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తున్న నౌషద్‌ ఖాన్‌ వీడియో తాజాగా వైరల్‌గా మారింది.

సర్ఫరాజ్‌, నౌషద్‌ ఖాన్‌ ఫాలో అయిన డైట్‌ ఇదే
గతంలో నౌషద్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. తాము రోటీ, అన్నం తినడం పూర్తిగా మానేశమని తెలిపాడు. అదే విధంగా ఫైబర్‌ అధికంగా ఉండే పండ్లు, సలాడ్లు, బ్రకోలి, దోసకాయలు ఎక్కువగా తింటున్నామని తెలిపాడు.

అదే విధంగా కాల్చిన చేపలు, చికెన్‌, ఉడికించిన కోడిగుడ్లు, అవకాడోలు ఎక్కువగా తిన్నామని నౌషద్‌ ఖాన్‌ వెల్లడించాడు. రోటీ అన్నంతో పాటు చక్కెరను పూర్తిగా పక్కనపెట్టామని.. మైదాతో తయారయ్యే బేకరీ పదార్థాలను కూడా డైట్‌ నుంచి పూర్తిగా తొలగించినట్లు వెల్లడించాడు.

ఏకంగా 38 కిలోలు 
ఇక ఆరునెలల్లోనే ఏకంగా 38 కిలోలు తగ్గడం గురించి 55 ఏళ్ల నౌషద్‌ ఖాన్‌ తాజాగా మాట్లాడుతూ.. ‘‘ఏప్రిల్‌ 11- అక్టోబరు 11 వరకు.. ఆరు నెలల కాలంలో నేను అనుకున్నది సాధించాను. 20-25 ఏళ్ల క్రితం చేయాలనుకున్న పనులను ఇపుడు నేను పూర్తి చేయగలను. 

మా కుటుంబం మొత్తం బరువు తగ్గే మిషన్‌లో ఉంది’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. కాగా సర్ఫరాజ్‌ ఖాన్‌ చివరగా గతేడాది న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.

చదవండి: మా అమ్మకి 19 ఏళ్లు.. నాన్నకు 60.. నా కూతురే నా పరువు.. హద్దు దాటితే అంతే!

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)