Breaking News

సారాంశ్‌కు స్వాగతం

Published on Wed, 07/29/2026 - 03:59

న్యూఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కింది. దశాబ్ద కాలానికి పైగా దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్న ఆఫ్‌స్పిన్నర్‌ సారాంశ్‌ జైన్‌కు ఎట్టకేలకు భారత టెస్టు జట్టు నుంచి పిలుపు వచ్చింది. వచ్చే నెల శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 33 ఏళ్ల సారాంశ్‌ ఎంపికయ్యాడు. తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 వరకు గాలెలో... రెండో టెస్టు కొలంబోలో ఆగస్టు 23 నుంచి 27 వరకు జరుగుతాయి. ఈ సిరీస్‌ కోసం బీసీసీఐ సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ మంగళవారం శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. 

గాయాలతో ఇబ్బంది పడుతున్న స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, సాయి సుదర్శన్‌ను కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. అయితే పర్యటన ప్రారంభానికి ముందు ఈ ఇద్దరూ ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానాన్ని సారాంశ్‌తో భర్తీ చేశారు. మధ్యప్రదేశ్‌ జట్టు రంజీ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఆల్‌రౌండర్‌... ఇటీవల శ్రీలంక ‘ఎ’తో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్‌ ‘ఎ’ జట్టు తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 

జట్టులో ఉన్న రవీంద్ర జడేజా, మానవ్‌ సుతార్, కుల్దీప్‌ యాదవ్‌ ముగ్గురూ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌లు కావడంతో... వైవిధ్యం కోసం కుడిచేతి వాటం స్పిన్నర్‌ సారాంశ్‌ను ఎంపిక చేశారు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 54 మ్యాచ్‌లు ఆడిన సారాంశ్‌ 27.30 సగటుతో 188 వికెట్లు పడగొట్టాడు.

భారత టెస్టు జట్టు: శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్ ), కేఎల్‌ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషభ్‌పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్‌ జురేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్, మానవ్‌ సుతార్, బుమ్రా, సిరాజ్, ప్రసిధ్, గుర్‌నూర్‌ బ్రార్, దేవదత్‌ పడిక్కల్, సారాంశ్‌ జైన్‌.

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)