సీఎస్‌కే కెప్టెన్‌గా సంజూ శాంసన్‌..! రాజస్తాన్‌లోకి జడేజా?

Published on Mon, 11/10/2025 - 09:17

ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ (RR), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య సంచలన ట్రేడ్ డీల్ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. టీమిండియా స్టార్ సంజూ శాంస్‌న్‌ను రాజస్తాన్ నుంచి ట్రేడ్ చేసుకునేందుకు సీఎస్‌కే సిద్ద‌మైన‌ట్లు స‌మాచారం.

ఐపీఎల్‌-2025 నుంచి శాంస‌న్‌, రాయల్స్ మ‌ధ్య విబేధాలు త‌లెత్తాయి. దీంతో రాజ‌స్తాన్ ఫ్రాంచైజీని వీడాల‌ని సంజూ నిర్ణ‌యించుకున్నాడు. ఈ క్ర‌మంలో సంజూ శాంస‌న్‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ తమ జ‌ట్టులోకి తీసుకోవాల‌ని భావించింది. కానీ రాజ‌స్తాన్‌, ఢిల్లీ మ‌ధ్య ట్రేడ్ డీల్ కుద‌ర‌క‌పోయిన‌ట్లు ఐపీఎల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

ఇప్పుడు సీఎస్‌కే ఎంట్రీ ఇచ్చింది.  సంజూ శాంసన్‌కు బ‌దులుగా  స్టార్ ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాను ఇచ్చేందుకు సీఎస్‌కే ప్రాంఛైజీ అంగీక‌రించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ అందుకు రాజ‌స్తాన్ ఒప్పుకోలేదంట‌. జ‌డేజాతో పాటు సౌతాఫ్రికా స్టార్ క్రికెట‌ర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను కూడా ఇవ్వాల‌ని రాయ‌ల్స్ యాజ‌మాన్యం డిమాండ్ చేసింది.

అందుకు సీఎస్‌కే కూడా అంగీక‌రించింది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే  రాజ‌స్తాన్ త‌మ మన‌సు మార్చుకుంది. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్‌ఫో ప్ర‌కారం.. రాజ‌స్తాన్ ఇప్పుడు బ్రెవిస్‌ను కాకుండా ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్‌ను జడేజాతో పాటు కావాలని డిమాండ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

రాజస్తాన్‌ మాస్టర్‌ ప్లాన్‌..
ఒకే దెబ్బ‌కు ఇద్ద‌రు వ‌ర‌ల్డ్ క్లాస్ ఆల్‌రౌండ‌ర్ల‌ను సొంతం చేసుకోవాల‌ని రాజ‌స్తాన్ ప్లాన్ చేసింది. అయితే అందుకోసం సీఎస్‌కే రూ. 2.40 కోట్లు చెల్లాంచాల్సి ఉంటుంది. శాంస‌న్‌, జ‌డేజా ఇద్ద‌రూ జీతం కూడా రూ. 18 కోట్లే. కాబ‌ట్టి ఇది స‌రిస‌మాన ట్రేడ్(స్వాప్ డీల్) అవుతోంది. 

కానీ కుర్రాన్ సీఎస్‌కే నుంచి రూ. 2.40 కోట్లు అందుకుంటున్నాడు. దీంతో ఆ మొత్తాన్ని రాజ‌స్తాన్ సీఎస్‌కే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సీఎస్‌కే-రాజ‌స్తాన్ మ‌ధ్య డీల్ దాదాపు ఖ‌రారైన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అంతే​కాకుండా సీఎస్‌కే యాజమాన్యం తమ జట్టు పగ్గాలను శాంసన్‌కు అప్పగించే యోచనలో కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక ఐపీఎల్‌-2026 మినీ వేలం డిసెంబ‌ర్ ఆఖ‌రిలో జరిగే ఛాన్స్ ఉంది. ఆయా ఫ్రాంచైజీలు న‌వంబ‌ర్ 15 లోపు త‌మ రిటెన్ష‌న్ జాబితాను బీసీసీఐ స‌మ‌ర్పించాల్సి ఉంది.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో భారీ ట్రేడ్ డీల్స్ ఇవే..
కామెరూన్ గ్రీన్-2024 సీజ‌న్‌- ముంబై ఇండియ‌న్స్ నుంచి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు- రూ. 17.5 కోట్లు

హార్దిక్ పాండ్యా- 2024 సీజ‌న్‌- గుజ‌రాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ (MI)-రూ. 17.5 కోట్లు

శిఖ‌ర్ ధావ‌న్‌- 2019 సీజ‌న్‌- సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ (DC)- రూ. 12.5 కోట్లు
చదవండి: ఆ ఓవరాక్షనే వద్దనేది.. అదేమైనా వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీనా?
 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)