Breaking News

ఐర్లాండ్‌తో తొలి టీ20.. సంజూ శాంసన్‌పై వేటు! సిక్సర్ల కింగ్‌ ఎంట్రీ

Published on Thu, 08/17/2023 - 10:00

స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా టీ20ల్లో తొలిసారి భారత జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్దమయ్యాడు. శుక్రవారం నుంచి ఐర్లాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో యువ భారత జట్టును బుమ్రా నడిపించనున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత బుమ్రాకు ఇదే తొలి సిరీస్‌ కావడం గమనార్హం. ఈ సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లు దూరం కావడంతో బుమ్రాకు జట్టు సారథ్య బాధ్యతలు సెలక్టర్లు అప్పగించారు.

అతడికి డిప్యూటీగా యువ ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ వ్యవహరించనున్నాడు. ఇక ఐరీష్‌కు సిరీస్‌కు ఈ ఐపీఎల్‌లో అదరగొట్టిన రింకూ సింగ్‌, శివమ్‌ దుబే, జితేష్‌ శర్మకు చోటు దక్కింది. అదే విధంగా విండీస్‌ పర్యటనలో అకట్టుకున్న యశస్వీ జైశ్వాల్‌, తిలక్‌ వర్మ కూడా ఐర్లాండ్ టూర్‌లో ఉన్నారు. మరోవైపు పేసర్‌ ప్రసిద్ద్‌ కృష్ణ కూడా ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

సంజూపై వేటు.. 
ఇక మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 డబ్లిన్‌ వేదికగా ఆగస్టు 18న జరగనుంది. ఈ మ్యాచ్‌తో యువ క్రికెటర్‌ రింకూ సింగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. రింకూ ఈ ఏడాది ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్యాష్‌రిచ్‌ లీగ్‌లో రింకూ సిక్సర్ల వర్షం కురిపించాడు.

 అదే విధంగా ఆల్‌రౌండర్‌ శివమ్‌ దుబే నాలుగేళ్ల తర్వాత మళ్లీ భారత్‌ తరపున ఆడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దుబే చివరగా 2019లో భారత తరపున ఆడాడు. మళ్లీ ఇప్పుడు ఐర్లాండ్‌ పర్యటనతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉండడంతో తొలి టీ20కు చోటు దక్కడం ఖాయమన్పిస్తోంది.

మరోవైపు విండీస్‌తో టీ20 సిరీస్‌లో విఫలమైన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ను తొలి టీ20కు పక్కన పెట్టాలని జట్టుమెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్ధానంలో అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేష్ శర్మకు ఛాన్స్‌ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తొలి టీ20కు భారత తుది జట్టు(అంచనా): రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ,శివం దూబే, రింకూ సింగ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్,రవి బిష్ణోయ్,షాబాజ్ అహ్మద్,అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, జస్ప్రీత్‌ బుమ్రా

చదవండి: #Matheesha Pathirana: 'చాలా గ్రేట్‌.. ధోని నుంచి చాలా నేర్చుకున్నా'

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)