సంజూ శాంస‌న్ కీల‌క నిర్ణ‌యం

Published on Sun, 12/21/2025 - 08:47

టీ20 వరల్డ్‌కప్‌-2026కు ఎంపికైన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు శాంసన్ సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో సంజూకు చోటు దక్కింది.

ఈ జ‌ట్టుకు యువ ఓపెన‌ర్ రోహన్ కున్నుమ్మల్ కెప్టెన్‌గా ఎంపిక‌య్యాడు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున రాణించిన స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ ఈ జ‌ట్టులో చోటు సంపాదించుకున్నాడు. కేర‌ళ జ‌ట్టులో ఎండీ నిదీష్, విష్ణు వినోద్, మహ్మద్ అజారుద్దీన్, వంటి అనుభవం ఉన్న ప్లేయ‌ర్లు ఉన్నారు. ఈ టోర్నీలో కేర‌ళ జ‌ట్టు గ్రూపు-ఈలో ఉంది.  ఈ గ్రూప్‌లో కేర‌ళ‌తో పాటు త్రిపుర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పాండిచ్చేరి, తమిళనాడు జట్లు ఉన్నాయి.

వ‌న్డే జ‌ట్టులోకి వ‌చ్చేందుకు..
భార‌త టీ20 టీ20 జ‌ట్టులో త‌న స్ధానాన్ని ప‌దిలం చేసుకున్న సంజూ శాంస‌న్‌.. ఇప్పుడు వ‌న్డే జ‌ట్టులోకి కూడా రావాలని త‌హత‌హ‌లాడుతున్నాడు. వాస్తవానికి సంజూకు వన్డేల్లో అద్భుత‌మైన రికార్డు ఉంది. ఈ కేర‌ళ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ త‌ర‌పున 16 వ‌న్డేలు ఆడి 56.67 స‌గ‌టుతో  510 ప‌రుగులు చేశాడు. 

ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ రాణిస్తే, భారత వన్డే జట్టులోకి రీఎంట్రీకి మార్గం సుగమం అవుతుంది. కాగా  ఈ ఏడాది దేశ‌వాళీ వ‌న్డే టోర్నీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆడ‌నున్నారు.

విజయ్ హజారే ట్రోఫీకి కేరళ  జట్టు:
రోహన్ కున్నుమ్మల్ (కెప్టెన్), సంజు శాంసన్, విష్ణు వినోద్ (వికెట్ కీపర్), మహమ్మద్ అజహరుద్దీన్ (వికెట్ కీపర్), అహమ్మద్ ఇమ్రాన్, సల్మాన్ నిజార్, అభిషేక్ జె. నాయర్, కృష్ణ ప్రసాద్, అఖిల్ స్కారియా, అభిజిత్ ప్రవీణ్ వి, బిజు నారాయణన్, అంకిత్ శర్మ, బాబా అపరాజిత్, విఘ్నేష్ పుత్తూర్, నిదీష్ ఎండి, ఆసిఫ్ కెఎమ్, అభిషేక్ పి. నాయర్, షరాఫుద్దీన్ ఎన్ఎమ్, ఎడెన్ ఆపిల్ టామ్.
చదవండి: 'అత‌డి రీ ఎంట్రీ చాలా సంతోషంగా ఉంది'


 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)