Breaking News

రెచ్చిపోయిన సంజూ శాంసన్‌.. 4 ఫోర్లు, 7 సిక్సర్లతో..!

Published on Tue, 12/13/2022 - 19:15

Ranji Trophy 2022-23 Kerala Vs Jharkhand: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా ఇవాళ (డిసెంబర్‌ 13) జార్ఖండ్‌తో మొదలైన మ్యాచ్‌లో కేరళ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న కేరళ.. శాంసన్‌ (72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), రోహన్‌ కున్నుమ్మల్‌ (50), రోహన్‌ ప్రేమ్‌ (79) అర్ధసెంచరీలతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.

అక్షయ్‌ చంద్రన్‌ (39), సిజోమోన్‌ జోసఫ్‌ (28) క్రీజ్‌లో ఉన్నారు. జార్ఖండ్‌ బౌలర్లలో షాబాజ్‌ నదీమ్‌ 3 వికెట్లు పడగొట్టగా, ఉత్కర్ష్‌ సింగ్‌ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా పాకెట్‌ డైనమైట్‌, జార్ఖండ్‌ ప్లేయర్‌ ఇషాన్‌ కిషన్‌ బ్యాటింగ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

రంజీ ట్రోఫీ 2022-23 తొలి రోజు నమోదైన అత్యుత్తమ గణాంకాలు..
తొలి రోజు రంజీ మ్యాచ్‌ల్లో సాదాసీదా గణాంకాలు నమోదయ్యాయి. కర్ణాటకపై సర్వీసెస్‌ బౌలర్‌ దివేశ్‌ పతానియా 5 వికెట్ల ఘనత సాధించగా, రైల్వేస్‌పై విదర్భ కెప్టెన్‌ ఫయాజ్‌ ఫజల్‌ (112) సెంచరీ,  రైల్వేస్‌ బౌలర్‌ కర్ణ్‌ శర్మ 8/38 అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు. 

హిమాచల్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్యానా 46 పరుగులకే ఆలౌట్‌ కాగా.. హిమాచల్‌ ఓపెనర్‌ ప్రశాంత్‌ చోప్రా (137) శతకంతో కదం తొక్కాడు. చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఆటగాడు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేయర్‌ అభిషేక్‌ శర్మ (100) శతకంతో రాణించగా, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (202) డబుల్‌ సెంచరీతో మెరిశాడు. 

మేఘాలయపై మిజోరం కెప్టెన్‌ తరువార్‌ కోహ్లి (123) శతకం సాధించగా.. గుజరాత్‌ కెప్టెన్‌ ప్రియాంక్‌ పంచల్‌ త్రిపురపై 111 సెంచరీ బాదాడు. ఇదే మ్యాచ్‌లో త్రిపుర బౌలర్‌ మురసింగ్‌ 5 వికెట్లతో రాణించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగాల్‌ బౌలర్‌ ఇషాన్‌ పోరెల్‌ 5 వికెట్ల ఘనత సాధించగా.. తమిళనాడుపై హైదరాబాద్‌ కెప్టెన్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (116) అజేయ శతకంతో రాణించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర బౌలర్‌ మనోజ్‌ ఇంగలే 5 వికెట్ల ఘనత సాధించాడు. 

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)