Breaking News

'బ్యాటింగే కాదు మాటలతోనూ మనసు దోచుకుంటాడు'

Published on Thu, 04/27/2023 - 18:22

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు మంచి ఆరంభం లభించినప్పటికి మధ్యలో వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడి టాప్‌ ప్లేస్‌ను సీఎస్‌కేకు కోల్పోయింది. తాజాగా గురువారం సొంత మైదానం జైపూర్‌లో సీఎస్‌కేను ఎదుర్కోనుంది. వరుస విజయాలతో దుమ్మురేపుతున్న ధోని సేనను రాజస్తాన్‌ ఎలా నిలువరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక కెప్టెన్‌ సంజూ శాంసన్‌ సీజన్‌లో పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఇప్పటివరకు శాంసన్‌ ఏడు మ్యాచ్‌లాడి 181 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. అయితే గత ఐదు మ్యాచ్‌లు కలిపి కేవలం 85 పరుగులు మాత్రమే చేసిన సంజూ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. మరి సీఎస్‌కేతో మ్యాచ్‌లో రాణిస్తాడేమో చూడాలి.

ఇక సీఎస్‌కేతో మ్యాచ్‌ను పురస్కరించుకొని బుధవారం శాంసన్‌ నెట్‌ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లను చూడడానికి అభిమానులు స్టేడియానికి వచ్చారు. ప్రాక్టీస్‌ ముగించుకునే సమయంలో అభిమానులు శాంసన్‌ను ఒక్క సెల్ఫీ అని పిలిచారు. దీనికి అంగీకరించిన శాంసన్‌ వెంటనే అభిమానులతో సెల్ఫీ దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇక్కడే ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

అభిమాని ఫోన్‌లో స్వయంగా శాంసన్‌ సెల్ఫీ తీస్తుండగా.. ఫోన్‌ రింగైంది. దీంతో సంజూ కాల్‌ లిఫ్ట్‌ చేశాడు. దీంతో పక్కనున్న అభిమాని.. ''అరె సంజూ భయ్యా మాట్లాడుతున్నాడు.. హలో చెప్పు'' అని పేర్కొన్నాడు. దీనికి ఫోన్‌లో ఉన్న అవతల వ్యక్తి ''నిజమా .. హలో సంజూ భయ్యా'' అని అడిగాడు. దీంతో సంజూ..''అవును నేనే.. హలో బ్రదర్‌ ఎలా ఉ‍న్నావు'' అంటూ చెప్పడంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు.. ''సంజూ బ్యాటింగ్‌తోనే కాదు మాటలతోనూ అభిమానుల మనసు దోచుకుంటాడు'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: #RCB: గెలిస్తే ఓకే.. గెలవకపోతే నీ పరిస్థితి ఏంటో!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)