Breaking News

అంత పొగ‌రా?.. స్టేజ్‌ పైనే చెక్‌ను విసిరేసిన పాక్ కెప్టెన్‌! వీడియో

Published on Mon, 09/29/2025 - 13:25

ఆసియాక‌ప్‌-2025లో భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు మూడు సార్లు త‌ల‌ప‌డ్డాయి. మూడు సార్లు కూడా పాక్‌కు జ‌ట్టుకు భార‌త్ చేతిలో ప‌రాభావం ఎదురైంది. లీగ్ స్టేజి, సూప‌ర్‌-4లో టీమిండియాపై ఓట‌మి చ‌విచూసిన పాకిస్తాన్‌కు ఇప్పుడు ఫైన‌ల్లో కూడా భంగ‌పాటు త‌ప్ప‌లేదు.

ఆదివారం దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన తుది పోరులో 5 వికెట్ల తేడాతో పాక్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. అయితే భారత్ చేతిలో ఓట‌మిని పాక్ ఆట‌గాళ్లు జీర్ణించుకులేక‌పొతున్నారు. అంత‌కుతోడు భార‌త ఆట‌గాళ్లు క‌నీసం క‌ర‌చాల‌నం చేయ‌క‌పోవ‌డం, ఫైన‌ల్ ప్రెజెంటేష‌న్ వేడుక‌లలో వారితో క‌లిసి పాల్గోక‌పోవ‌డంతో దాయాది ఆట‌గాళ్లు ఫ్రస్టేషన్ పీక్స్ చేరింది.

ఫైన‌ల్ మ్యాచ్ ముగిసినంత‌రం ఏసీసీ ఛీప్‌, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్  మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది. పాక్ ఆట‌గాళ్లు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్ సెర్మనీకు సిద్దంగా ఉన్న‌ప్ప‌టికి భార‌త ఆట‌గాళ్లు మాత్రం వేదిక ద‌గ్గ‌ర‌కు కూడా రాలేదు. దీంతో పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేష‌న్ సెర్మనీ దాదాపు గంట ఆల‌స్యంగా ప్రారంభ‌మైంది. కేవ‌లం పాక్ ఆట‌గాళ్లు మాత్రమే ర‌న్న‌ర‌ప్ మెడ‌ల్స్‌ను తీసుకున్నారు.

పాక్ కెప్టెన్ ఓవ‌రాక్ష‌న్‌..
ఈ క్ర‌మంలో పాక్ కెప్టెన్ స‌ల్మాన్ అలీ అఘాకు ఆసియన్ క్రికెట్ కౌన్సెల్ (ఏసీసీ) చైర్మెన్‌, ఏసీసీ ప్ర‌తినిథి ఆమినుల్ ఇస్లాం రన్నరప్ టైటిల్ అంద‌జేశారు. అయితే ఇక్కడే స‌ల్మాన్ అలీ ఓవ‌రాక్ష‌న్ చేశాడు. చెక్కు తీసుకున్న పాక్ కెప్టెన్ వెంట‌నే  స్టేజ్ మీద నుంచి కింద‌కు విసిరేశాడు.

అతడి తీరుతో వేదిక మీద ఉన్న వారు షాక్‌కు గురయ్యారు. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా ఆసియా కప్ టైటిల్ అందుకోవడానికి ఇష్టపడకపోవడంతో స‌ల్మాన్ ఇలా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత స్టేజిపై నుంచి కింద‌కు వ‌స్తుండ‌గా స‌ల్మాన్‌ను భారత్ ఫ్యాన్స్ గ‌ట్టిగా అరుస్తూ హేళ‌న చేశారు. 

దీంతో అత‌డు చేసేదేమి లేక న‌వ్వుతూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ఇది చూసిన నెటిజ‌న్లు మ‌రి అంత పొగ‌రు ప‌నికిరాదు అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడ‌ల్స్‌ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్‌.. బీసీసీఐ సీరియ‌స్‌


 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)