టీమిండియా యంగ్‌ స్టార్‌కు తీవ్ర గాయం.. విరిగిన పక్కటెముక

Published on Fri, 01/02/2026 - 21:16

మైదానంలో తీవ్రంగా గాయపడి, నెలల పాటు ఆటకు దూరమైన శ్రేయస్‌ అయ్యర్‌ ఉదంతం మరవకముందే మరో టీమిండియా ఆటగాడు మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా ఇటీవల మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు ఆటగాడు, టీమిండియా యంగ్‌ స్టార్‌ సాయి సుదర్శన్‌ పక్కటెముక విరిగింది. 

పరుగు పూర్తి చేసే క్రమంలో డైవ్ చేసిన సుదర్శన్‌ ప్రమాదకర రీతిలో కింద పడ్డాడు. అప్పటికి గాయం పెద్దదిగా అనిపించనప్పటికీ స్కానింగ్‌ల్లో రిబ్‌ ఫ్రాక్చర్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ గాయం కారణంగా సాయి  వీహెచ్‌టీలో తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అతనికి 6-8 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ప్రస్తుతం సాయి బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. 

సాయి ఐపీఎల్‌ 2026 ప్రారంభ సమయానికి పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని సమాచారం. సాయి గుజరాత్‌ టైటాన్స్‌లో కీలక సభ్యుడు. గత కొన్ని సీజన్లుగా అతను టైటాన్స్‌ తరఫున స్థిరంగా రాణిస్తున్నాడు.

సాయికి ఇటీవల ఇంగ్లండ్‌ పర్యటనలో భారత టెస్ట్‌ జట్టులో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే వాటిని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అతని తదుపరి టీమిండియా అవకాశాలు ఐపీఎల్‌ 2026 ప్రదర్శనలపై ఆధారపడి ఉంటాయి. 

24 ఏళ్ల సాయి టీమిండియా తరఫున 6 టెస్ట్‌ల్లో 2 అర్ద సెంచరీల సాయంతో 302 పరుగులు.. 3 వన్డేల్లో 2 అర్ద సెంచరీల సాయంతో 127 పరుగులు చేశాడు. 

ఐపీఎల్‌లో సాయికి ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. అరంగేట్రం నుంచి గుజరాత్‌ టైటాన్స్‌కే ఆడుతున్న సాయి.. 40 మ్యాచ్‌ల్లో 145కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో, కళ్లు చెదిరే 49.8 సగటున 2 సెంచరీలు, 12 హాఫ్‌ సెంచరీల సాయంతో 1793 పరుగులు చేశాడు. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)