'ధోని, రుతురాజ్‌ కాదు.. అతడే సీఎస్‌కే బ్యాక్‌ బోన్‌'

Published on Fri, 03/13/2026 - 16:07

టీ20 వరల్డ్‌కప్‌-2026లో సంచలన ప్రదర్శన కనబరిచిన టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్.. ఇప్పుడు ఐపీఎల్‌లో సత్తాచాటేందుకు సిద్దమవుతున్నాడు. తన అరంగేట్రం నుంచి గత సీజన్‌ వరకు రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన సంజూ, ఈసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ఆడనున్నాడు. 

ఐపీఎల్‌-2026 సీజన్‌కు ముందు సీఎస్‌కే ఫ్రాంచైజీ సంజూను రాజస్తాన్‌ నుంచి ట్రేడ్‌ చేసుకుంది. అందుకోసం చెన్నై ఏకంగా స్టార్‌ ప్లేయర్లు రవీంద్ర జడేజా, సామ్‌ కుర్రాన్‌లను వదులుకుంది. ఈ నేపథ్యంలో శాంసన్‌పై భారత మాజీ క్రికెటర్‌ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. శాంసన్‌ రాకతో సీఎస్‌కేలో మరో కొత్త శకం మొదలవుతుందని అతడు అభిప్రాయపడ్డాడు.

"సీఎస్‌కే ఒక పెద్ద ఫ్రాంచైజీ. ఇప్పటికే ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు రాజస్తాన్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న సంజూ శాంసన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సీఎస్‌కేలో ఇక శాంసన్ శకం మొదలు కానుంది. అతడు ఆ జట్టుకు వెన్నెముకలా మారబోతున్నాడు. దీర్ఘకాలిక ప్రణాళికలలో భాగంగా సంజూను సీఎస్‌కే జట్టులోకి తీసుకుంది.

అతడు భవిష్యత్తులో కెప్టెన్‌ అయ్యే అవకాశముంది. అయితే అందుకు ఇంకా చాలా సమయం ఉందని" బద్రీనాథ్ తన యూట్యూబ్‌ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. సీఎస్‌కే తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29న గౌహతి వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ వ్యవహరించనున్నాడు.
చదవండి: స‌న్‌రైజ‌ర్స్‌లోకి పాక్ ఆట‌గాడు.. బీసీసీఐ స్పంద‌న ఇదే
 

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)