వెస్టిండీస్ కెప్టెన్‌గా స్టార్‌ ఆల్‌రౌండర్‌?

Published on Fri, 05/16/2025 - 18:46

వెస్టిండీస్ క్రికెట్ జట్టు కొత్త టెస్ట్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండ‌ర్ రోస్టన్ చేజ్ ఎంపికానున్నట్లు తెలుస్తోంది. విండీస్ టెస్టు కెప్టెన్‌గా వైదొలిగిన‌ క్రెయిగ్ బ్రాత్‌వైట్ స్ధానాన్ని చేజ్ భ‌ర్తీ చేయ‌నున్నాడు. ఈ ఏడాది జూన్‌లో స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్ నుంచి కెప్టెన్‌గా త‌న ప్ర‌యాణాన్ని చేజ్ ప్రారంభించ‌నున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. చేజ్ నియ‌మాకంపై త్వ‌రలోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశ‌ముంది.

2016లో విండీస్ త‌ర‌పున అరంగేట్రం చేసిన చేజ్‌.. త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 49 టెస్టులు ఆడాడు. అందులో  26.33 సగటుతో 2,000 పరుగులు చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌ల‌లో ఐదు సెంచ‌రీలు, 11 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అదేవిధంగా 85 వికెట్ల‌ను కూడా త‌న ఖాతాలో వేసుకున్నాడు.

రోస్టన్ చేజ్ ప్రస్తుతం వెస్టిండీస్ జట్టుతో కలిసి ఐర్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాడు. ఐర్లాండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్ కోసం చేజ్ సిద్ద‌మ‌వుతున్నాడు. ఆ త‌ర్వాత ఈ నెల ఆఖ‌రిలో ఇంగ్లండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌లో విండీస్ త‌ల‌ప‌డ‌నుంది.

అనంతరం జూన్‌ మధ్యలో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో కరేబియన్లు ఢీకొట్టనున్నారు. ఈ సిరీస్ డబ్ల్యూటీసీ సైకిల్ 2025-27లో భాగంగా జరగనుంది. కాగా విండీస్‌ టెస్టు కెప్టెన్సీ బ్రాత్‌వైట్ ఈ ఏడాది మార్చిలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: వారి త్యాగాల వల్లే ఇలా ఉన్నా.. అరుదైన గౌరవం.. రోహిత్‌ శర్మ భావోద్వేగం

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)