Breaking News

ముంబై ఇండియన్స్‌ తరపున 200వ మ్యాచ్‌.. చెత్త రికార్డు

Published on Wed, 05/03/2023 - 22:46

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ వైఫల్యం కొనసాగుతుంది. తాజాగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు.  రిషి ధావన్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో మూడో బంతిని స్క్వేర్‌లెగ్‌ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న థర్డ్‌మన్‌ ఫీల్డర్‌ మాథ్యూ షార్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

గత మూడు మ్యాచ్‌ల్లో రోహిత్‌ వరుసగా 2,0,0..  ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాడు. సీజన్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ తన ఇంపాక్ట్‌ చూపలేకపోయాడు. ఇక రోహిత్‌ శర్మకు ముంబై ఇండియన్స్‌ తరపున ఇది 200వ మ్యాచ్‌ కావడం విశేషం.

అలాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో రోహిత్‌ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో డకౌట్‌ అయిన రోహిత్‌కు ఐపీఎల్‌లో ఇది 15వ డకౌట్‌ కావడం గమనార్హం. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక డకౌట్లు అయిన జాబితాలో రోహిత్‌ చోటు సంపాదించాడు. 15 డకౌట్లతో దినేశ్‌ కార్తిక్‌, సునీల్‌ నరైన్‌, మణిదీప్‌ సింగ్‌లతో కలిసి రోహిత్‌ సంయుక్తంగా నిలిచాడు.

చదవండి: అర్జున్‌ నయం.. ఆర్చర్‌ను నమ్మి తప్పు చేశాడా!

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)