చరిత్రకు అడుగు దూరంలో రోహిత్‌.. సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డుపై కన్ను

Published on Sun, 09/15/2024 - 08:49

దాదాపు నెల రోజుల సుదీర్ఘ విరామం త‌ర్వాత భార‌త క్రికెట్ జ‌ట్టు తిరిగి మైదానంలో అడుగుపెట్ట‌నుంది. బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు టీమిండియా సిద్ద‌మ‌వుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మ‌ధ్య తొలి టెస్టు సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదిక‌గా ఆరంభం కానుంది. 

ఈ మ్యాచ్ కోసం ఇప్ప‌టికే చెన్నైకు చేరుకున్న టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తోంది. కొత్త బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్క‌ల్ సైతం భార‌త జ‌ట్టుతో చేరాడు. బంగ్లా క్రికెట్ జ‌ట్టు కూడా సోమవారం(సెప్టెంబ‌ర్ 16)న భార‌త గ‌డ్డ‌పై అడుగుపెట్టే అవ‌కాశ‌ముంది. కాగా వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ లో ఫైనల్ కు చేరాలంటే భారత్ కు ఈ సిరీస్ చాలా కీల‌కం. అందుకు త‌గ్గ‌ట్టే భార‌త్ త‌మ వ్యూహాలు రచిస్తోంది.

సెహ్వాగ్ రికార్డుపై క‌న్నేసిన హిట్‌మ్యాన్‌..
బంగ్లాతో తొలి టెస్టుకు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. చెపాక్ టెస్టులో హిట్‌మ్యాన్ మ‌రో 7 సిక్స‌ర్లు బాదితే టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు న‌మోదు చేసిన వీరేంద్ర సెహ్వాగ్ ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేస్తాడు.

సెహ్వాగ్ 103 టెస్టుల్లో 90 సిక్స్‌లు బాదగా.. రోహిత్ శర్మ 59 టెస్టు మ్యాచ్‌ల్లో ఇప్పటి వరకు 84 సిక్స్‌లు కొట్టాడు. ప్ర‌స్తుతం ఈ జాబితాలో రోహిత్ రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. హిట్‌మ్యాన్ త‌ర్వాతి స్ధానాల్లో 78 సిక్స్‌లతో ధోనీ, 69 సిక్స్‌లతో సచిన్, 64 సిక్స్‌లతో రవీంద్ర జడేజా వ‌రుస‌గా కొన‌సాగుతున్నారు.
చదవండి: ఒకవేళ టీమిండియా మా దేశానికి రాకపోతే: పాక్‌ మాజీ క్రికెటర్‌

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)