Breaking News

రోహిత్‌ శర్మ వీడియోను 10 కోట్ల మందికిపైగా చూశారు.. ఆ వీడియో ఏదంటే..?

Published on Mon, 03/27/2023 - 16:56

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వీడియోను యూట్యూబ్‌లో 10 కోట్ల మందికి పైగా వీక్షించారు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై హిట్‌మ్యాన్‌ చేసిన 140 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోకు ఐసీసీ యూట్యూబ్‌ పేజీలో రికార్డు స్థాయి వ్యూస్‌ దక్కాయి. ఐసీసీ యూట్యూబ్‌ పేజీలో 10 కోట్ల వ్యూస్‌ దాటిన తొలి వీడియో ఇదే కావడం విశేషం. గతంలో ఏ వీడియోకు ఈ స్థాయిలో వ్యూస్‌ రాలేదు.

పాక్‌పై రోహిత్‌ మెరుపు శతకం విషయానికొస్తే.. జూన్‌ 16, 2019లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో (వరల్డ్‌కప్‌) తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. రోహిత్‌ శర్మ (113 బంతుల్లో 140; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (65 బంతుల్లో 77; 7 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ (78 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 చేసింది.

ఛేదనకు దిగిన పాక్‌ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగా  వర్షం పడింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో  డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్‌ను విజేతగా ప్రకటించారు. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 40 ఓవర్లు పూర్తయ్యే సరికి పాక్‌ 302 పరుగులు చేయాల్సి ఉండింది. అయితే పాక్‌ 216 పరుగులకే పరిమితం కావడంతో భారత్‌ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)