Breaking News

చరిత్ర సృష్టించిన ‘హిట్‌మ్యాన్‌’.. ఆసియాలోనే తొలి క్రికెటర్‌గా

Published on Thu, 10/23/2025 - 14:08

ఆస్ట్రేలియా పర్యటనను పేలవంగా ఆరంభించిన టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) తిరిగి పుంజుకున్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి వన్డేలో ఎనిమిది పరుగులే చేసిన ‘హిట్‌మ్యాన్‌’.. రెండో వన్డేలో మాత్రం రాణించాడు.

అడిలైడ్‌ (IND vs AUS 2nd ODI)లో గురువారం నాటి మ్యాచ్‌లో ఓపెనింగ్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ.. అర్ధ శతకం సాధించాడు. డెబ్బై నాలుగు బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం ఆటగాడు.. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొని 73 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు ఫోర్లతో పాటు రెండు సిక్సర్లు ఉన్నాయి.

సరికొత్త చరిత్ర
ఇ‍క రోహిత్‌ బాదిన రెండు సిక్సర్లు కూడా భారత ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో వచ్చినవే. ఆసీస్‌ పేసర్‌ మిచెల్‌ ఓవెన్‌ బౌలింగ్‌లో తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన హిట్‌మ్యాన్‌.. మూడో బంతిని కూడా బౌండరీ మీదుగా తరలించాడు. అయితే, తొలి సిక్సర్‌తోనే రోహిత్‌ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల్లో 150 సిక్సర్లు బాదిన ఆసియా తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు రో‘హిట్‌’ శర్మ SENA దేశాల్లో మూడు ఫార్మాట్లలో కలిపి 156 మ్యాచ్‌లు ఆడి 151 సిక్సర్లు బాదడం విశేషం.

SENA దేశాల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆసియా క్రికెటర్లు
🏏రోహిత్‌ శర్మ (ఇండియా)- 156 మ్యాచ్‌లలో 151*
🏏సనత్‌ జయసూర్య (శ్రీలంక)- 171 మ్యాచ్‌లలో 113
🏏షాహిద్‌ ఆఫ్రిది (పాకిస్తాన్‌)- 139 మ్యాచ్‌లలో 105
🏏మహేంద్ర సింగ్‌ ధోని (ఇండియా)- 175 మ్యాచ్‌లలో 83
🏏విరాట్‌ కోహ్లి (ఇండియా)- 177 మ్యాచ్‌లలో 83.

👉ఇదిలా ఉంటే.. శ్రేయస్‌ అయ్యర్‌ (61)తో కలిసి మూడో వికెట్‌కు 118 పరుగులు జతచేసిన రోహిత్‌ శర్మ.. మిచెల్‌ స్టార్క్‌ బౌలింగ్‌లో జోష్‌ హాజిల్‌వుడ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఇక రోహిత్‌, శ్రేయస్‌ అర్ధ శతకాలకు తోడు అక్షర్‌ పటేల్‌ (41 బంతుల్లో 44), హర్షిత్‌ రాణా (18 బంతుల్లో 24 నాటౌట్‌) రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 264 పరుగులు చేయగలిగింది. 

చదవండి: డకౌట్‌ తర్వాత కోహ్లి చర్య వైరల్‌.. గుడ్‌బై చెప్పేశాడా?

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)