Breaking News

టెస్టులకు రోహిత్‌ శర్మ గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం!

Published on Tue, 12/31/2024 - 11:04

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌(Test Retirement) ప్రకటించనున్నాడా? ఆస్ట్రేలియాతో సిడ్నీ మ్యాచ్‌ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడా? అంటే క్రికెట్‌ వర్గాల్లో అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. 

సారథిగా, బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ విఫలం
కాగా సారథిగా, బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ ఇటీవల గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైన రోహిత్‌ సేన.. ఆస్ట్రేలియాలోనూ విఫలమవుతోంది. 

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా పెర్త్‌ టెస్టులో జస్‌ప్రీత్‌ బుమ్రా సారథ్యంలో గెలుపొందిన టీమిండియా.. రోహిత్‌ కెప్టెన్సీలో అడిలైడ్‌, బ్రిస్బేన్‌, మెల్‌బోర్న్‌ టెస్టుల్లో తీవ్రంగా నిరాశపరిచింది.

కెప్టెన్‌గానూ, బ్యాటర్‌గానూ రోహిత్‌ శర్మ దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా తాజాగా ముగిసిన మెల్‌బోర్న్‌ టెస్టులో రోహిత్‌(3, 9) తన రెగ్యులర్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చినా.. ఆకట్టుకోలేకపోయాడు. పట్టుమని పది పరుగులు చేయకుండానే అవుటయ్యాడు.

త్వరగా రిటైర్‌ పోవాలంటూ
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 184 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ కెప్టెన్సీ, బ్యాటింగ్‌ తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. త్వరగా రిటైర్‌ పోవాలంటూ హిట్‌మ్యాన్‌కు సూచనలు వస్తున్నాయి. అయితే, ఆసీస్‌తో ఆఖరిదైన సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత ఈ విషయమై నిర్ణయం తీసుకునేందుకు రోహిత్‌ సిద్ధమైనట్లు సమాచారం.

టెస్టులకు గుడ్‌బై!?.. ప్రకటనకు రంగం సిద్ధం!
ఇప్పటికే తన రిటైర్మెంట్‌ గురించి సెలక్టర్లు, బీసీసీఐ నాయకత్వంతో చర్చించిన రోహిత్‌ శర్మ.. సిడ్నీ టెస్టులో ఓడితే తన మనసులోని మాటను వెల్లడించనున్నాడట. ఒకవేళ ఆ మ్యాచ్‌లో గెలిచి.. టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 ఫైనల్‌ చేరే అవకాశాలు ఉంటే మాత్రం.. ఆ మెగా మ్యాచ్‌ వరకు సారథిగా కొనసాగాలని భావిస్తున్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం పేర్కొంది.

ఏదేమైనా సిడ్నీ టెస్టుతో రోహిత్‌ శర్మ టెస్టు క్రికెట్‌ భవితవ్యంపై ఒక అంచనాకు రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ రోహిత్‌ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తే అతడి స్థానంలో జస్‌ప్రీత్‌ బుమ్రా పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. 

గణాంకాలు ఇవీ
కాగా టెస్టుల్లో గత పదకొండు ఇన్నింగ్స్‌లో రోహిత్‌ శర్మ నమోదు చేసిన స్కోర్లు ఇవే   2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9. రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ తీరు ఎలా ఉందో చెప్పడానికి ఈ గణాంకాలు చాలు. అయితే, ఏ ఆటగాడికైనా గడ్డు దశ అనేది ఉంటుంది. కానీ.. 37 ఏళ్ల రోహిత్‌ వికెట్‌ పారేసుకున్న తీరు కారణంగానే అతడి రిటైర్మెంట్‌పై చర్చలు ఎక్కువయ్యాయి.

టీమిండియాకు చేదు అనుభవాలు
ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా- టీమిండియా మధ్య సిడ్నీ వేదికగా ఆఖరి టెస్టు జరుగనుంది. జనవరి 3-7 వరకు ఈ మ్యాచ్‌ నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇదిలా ఉంటే.. పెర్త్‌లో భారత్‌ 275 పరుగులతో గెలవగా.. అడిలైడ్‌లో ఆసీస్‌ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

వర్షం వల్ల బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రా కాగా.. మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో ఆతిథ్య ఆసీస్‌ 184 పరుగుల తేడాతో రోహిత్‌ సేనను చిత్తు చేసింది. తద్వారా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లడంతో పాటు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అవకాశాలను సజీవం చేసుకుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024 తర్వాత రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

చదవండి: 2025లో టీమిండియా షెడ్యూల్‌ ఇదే..!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)