Breaking News

రోహిత్‌ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!

Published on Sat, 05/17/2025 - 08:22

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) తల్లిదండ్రులు పూర్ణిమా శర్మ- గురునాథ్‌ శర్మ కన్నీటి పర్యంతమయ్యారు. కష్టాల కడలిని దాటి శిఖరాగ్రానికి చేరుకున్న కుమారుడిని చూసి పుత్రోత్సాహంతో పొంగిపోయారు. కాగా బ్యాటర్‌గా, కెప్టెన్‌గా తనకంటూ ప్రత్యేక అధ్యాయం రచించుకున్న రోహిత్‌ శర్మను అతని సొంత సంఘం ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ (MCA) సముచిత రీతిలో గౌరవించిన విషయం తెలిసిందే.

ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియంలో ఒక ప్రేక్షకుల గ్యాలరీకి  ‘రోహిత్‌ శర్మ స్టాండ్‌’ అని పేరు పెట్టింది. ఈ స్టాండ్‌ ఆవిష్కరణ కార్యక్రమంశుక్రవారం  జరిగింది. రోహిత్‌ తల్లిదండ్రులు పూర్ణిమ, గురునాథ్, భార్య రితిక (Ritika), మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఈ కార్యక్రమానికి హాజరై ‘రోహిత్‌ శర్మ స్టాండ్‌’ను ప్రారంభించారు. 

రోహిత్‌ భావోద్వేగం
ఈ సందర్భంగా మాట్లాడుతూ రోహిత్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ‘నేడు ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. ఇదో ప్రత్యేక అనుభూతి. మ్యాచ్‌లలో సాధించే ఎన్నో మైలురాళ్లకంటే విశేషమైంది.

వాంఖడేలాంటి ప్రతిష్టాత్మక మైదానంలో ఎంతో మంది దిగ్గజాల సరసన నా పేరు కనిపిస్తున్న ఆనందాన్ని మాటల్లో వర్ణించలేదు. ఈ స్టేడియంలో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. నేను ఇంకా క్రికెట్‌ ఆడుతున్నాను. వచ్చే బుధవారం ఇక్కడ నా స్టాండ్‌ ముందు ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడబోతున్నాను. అది చాలా గొప్ప అనుభవం అవుతుంది.

ఇక భారత్‌ తరఫున మ్యాచ్‌ ఆడితే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. నా కుటుంబ సభ్యులందరి ముందు ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ ఎంతో కృతజ్ఞుడను’ అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. 

కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
మరోవైపు.. కుమారుడి పేరిట స్టాండ్‌ ఆవిష్కరణ కాగానే పూర్ణిమా- గురునాథ్‌ ఆనందభాష్పాలు రాల్చగా.. రితిక కూడా తీవ్ర భావోద్వేగానికి లోనైంది. కన్నీళ్లు తుడుచుకుంటూ మామగారి వెనుకగా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌ పేరిట, సీనియర్‌ అడ్మినిస్ట్రేటర్, ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ పేరిట కూడా స్టాండ్‌లను ఆవిష్కరించిన ఎంసీఏ... ఇటీవలే కన్నుమూసిన మాజీ అధ్యక్షుడు అమోల్‌ కాలే పేరిట ప్రత్యేక లాంజ్‌ను కూడా ప్రారంభించింది.  

‘నేనైతే సిడ్నీలో రోహిత్‌ను ఆడించే వాడిని’ 
మరోవైపు.. ఆస్ట్రేలియాతో సిరీస్‌తో చివరి టెస్టుకు ముందు తాను ఫామ్‌లో లేనంటూ రోహిత్‌ శర్మ స్వయంగా తప్పుకొన్నాడు. సిడ్నీలో జరిగిన ఈ టెస్టుకు దూరమైన అతను మళ్లీ టెస్టు ఆడకుండానే ఇటీవల రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే తాను జట్టు కోచ్‌గా ఉండి ఉంటే రోహిత్‌ను తప్పనిసరిగా ఆ టెస్టులో ఆడించే వాడినని మాజీ కోచ్‌ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

‘సిరీస్‌ ముగిసిపోలేదు కాబట్టి కచి్చతంగా అతడిని ఆడించే వాడిని. సిరీస్‌లో 1–2తో వెనుకబడి ఉన్న సమయంలో జట్టును వదలవద్దని చెప్పేవాడిని. ఆ టెస్టులో తేడా ఒక 30–40 పరుగులు మాత్రమే. ఫామ్‌ ఎలా ఉన్న అతనో మ్యాచ్‌ విన్నర్‌. పిచ్‌పై పరిస్థితిని అర్థం చేసుకొని ఓపెనర్‌గా ఒక 35–40 పరుగులు చేసి ఉంటే చాలు మ్యాచ్‌ ఫలితం మారిపోయేదేమో. సిరీస్‌ కూడా సమంగా ముగిసేది. అక్కడ రోహిత్‌ ఆడకపోవడం నన్ను చాలా కాలం వెంటాడింది’ అని రవిశాస్త్రి తన మనసులో మాటను పంచుకున్నాడు.   

చదవండి: Rohit Sharma Interesting Facts: పేద కుటుంబంలో పుట్టి.. కోటీశ్వరుడిగా! లగ్జరీ ఇల్లు, కార్లు.. ఆస్తి ఎంతంటే?

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?