రహానే వీడ్కోలుపై లేటుగా స్పందించిన రోహిత్‌!

Published on Fri, 07/31/2026 - 14:53

అజింక్య రహానే రిటైర్మెంట్‌పై భార‌త సీనియ‌ర్ క్రికెట‌ర్ రోహిత్ శ‌ర్మ ఆల‌స్యంగా స్పందించాడు. రోహిత్‌తో పాటు సూర్య‌కుమార్ యాద‌వ్ కూడా ర‌హానేకు బెస్ట్ విషెస్ చెప్పాడు. మాజీ కెప్టెన్‌ రోహిత్ శర్మ‌.. రహానేతో కలిసి గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ భావోద్వేగంతో స్పందించాడు. 

'మేమిద్దరం చాలా ఏళ్ల పాటు డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్నాం. రహానే ఎంత కష్టపడతాడో నాకు బాగా తెలుసు. నువ్వు సాధించిన విజయాలు అద్భుతం. నీ నిబద్ధత, వృత్తిపట్ల అంకితభావం నిజంగా ప్రత్యేకమైనవి. అద్భుతమైన కెరీర్‌కు అభినందనలు. నీ భవిష్యత్తు మరింత విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్' అని రోహిత్ వెల్ల‌డించాడు.

ఇక టీమిండియా టీ20 స్పెష‌లిస్ట్ సూర్యకుమార్ యాదవ్ కూడా రహానేకు భావోద్వేగ సందేశం పంపాడు. 'అజ్జూ భాయ్.. నీతో కలిసి మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూమ్‌లోనూ గడపడం నాకు గౌరవంగా భావిస్తున్నా. నీ ప్రశాంత స్వభావం, ఆటపట్ల అంకితభావం అద్భుతం. నువ్వు ఎప్పుడూ మాకు స్ఫూర్తిగా నిలిచావు. నీ జీవితంలోని రెండో ఇన్నింగ్స్ కూడా అంతే విజయవంతంగా, సంతోషంగా సాగాలని నీకు, నీ కుటుంబ సభ్యులకు ఇదే నా ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు' అని సూర్య చెప్పుకొచ్చాడు. 

ప్ర‌స్తుతం ర‌హానే హండ్రెడ్ కాంపిటీష‌న్‌లో కామెంటేట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అక్క‌డి నుంచే త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా రిటైర్మెంట్ వార్త‌ను పంచుకున్నాడు. జెర్సీ నెంబ‌ర్ 278కి వీడ్కోలు అంటే ర‌హానే ఒక వీడియోను సోష‌ల్‌మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఆ త‌ర్వాత త‌న రిటైర్మెంట్‌పై భావోద్వేగ సందేశాన్ని వినిపించాడు. ఈ సందర్భంగా అతడి సహచరులు, దిగ్గజ క్రికెటర్లు ర‌హానే కెరీర్‌ను కొనియాడుతూ ప్ర‌త్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఫస్ట్ క్లాస్‌లో నిలకడగా రాణించిన రహానే 2013లో ఆస్ట్రేలియాపై మ్యాచ్‌తో టెస్టులో అరంగేట్రం చేశాడు. తన డిఫెన్స్, నిబద్ధతో ర‌హానే అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 15 ఏళ్ల అంత‌ర్జాతీయ కెరీర్‌లో ర‌హానే 85 టెస్టుల్లో 5,077 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 సెంచ‌రీలు, 26 అర్ధ‌సెంచ‌రీలున్నాయి. ఇక 90 వ‌న్డే మ్యాచ్‌ల్లో 2,962 ప‌రుగులు సాధించిన ర‌హానే ఖాతాలో మూడు సెంచ‌రీలు, 24 అర్ధ‌శ‌తకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో 20 మ్యాచ్‌లాడిన ర‌హానే 375 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఒక ఫిఫ్టీ ఉంది. 

 

Read: పక్కలో బల్లెంలా తయారయ్యాడు.. పంత్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్‌!

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)