Breaking News

ఆ ఇద్దరితో రూమ్‌ అస్సలు షేర్‌ చేసుకోను: రోహిత్‌ శర్మ

Published on Sun, 04/07/2024 - 16:49

ప్రముఖ కమెడియన్‌ కపిల్‌ శర్మ హోస్ట్‌ చేసిన ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షోలో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కపిల్‌.. హిట్‌మ్యాన్‌, శ్రేయస్‌లను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. వీటికి రోహిత్‌, శ్రేయస్‌ తమదైన శైలిలో బదులిచ్చారు. ఈ సందర్భంగా రోహిత్‌, శ్రేయస్‌ అభిమానులకు తెలియని చాలా విషయాలను షేర్‌ చేసుకున్నారు. ఆధ్యాంతం ఉల్లాసభరింతగా సాగిన ఈ షో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతుంది. 

ఆ ఇద్దరు పరమ గలీజ్‌గాళ్లు..
షో సందర్భంగా కపిల్‌ హిట్‌మ్యాన్‌తో సంభాషిస్తూ ఓ ఆసక్తికర ప్రశ్నను అడిగాడు. రూమ్‌ షేర్‌ చేసుకోవాల్సి వస్తే ఎవరితో కలసి షేర్‌ చేసుకుంటారని రోహిత్‌ను అడిగాడు. ఇందుకు రోహిత్‌ బదులిస్తూ.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గది కేటాయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూమ్‌ షేర్‌ చేసుకోవాల్సి వస్తే శిఖర్‌ ధవన్‌, రిషబ్‌ పంత్‌లతో మాత్రం అస్సలు ఉండనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు.

ఆ ఇద్దరు గదిని చాలా మురికిగా ఉంచుతారు. ప్రాక్టీస్‌ నుంచి వచ్చాక బట్టలను మంచంపైనే పడేస్తారు. వారి గది తలపుపై ఎప్పుడూ డు నాట్‌ డిస్టర్బ్‌ (DOD) అనే బోర్డు దర్శనమిస్తుంది. ఈ ఇద్దరు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పడుకుంటారు. ఉదయమే రూమ్‌ క్లీనింగ్‌కు వచ్చే వాళ్లు DOD బోర్డును చూసి వెనక్కు వెళ్లిపోతారు. మూడు నాలుగు రోజుల వరకు వాళ్ల రూమ్‌ చండాలంగా ఉంటుంది. ఈ కారణంగా వీళ్లతో రూమ్‌ షేర్‌ చేసుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. నేను కూడా వారితో ఉండాలని అ‍స్సలు అనుకోనంటూ హిట్‌మ్యాన్‌ బదులిచ్చాడు.

ఇదే సందర్భంగా రోహిత్‌ మరిన్ని విషయాలను కూడా షేర్‌ చేసుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఓటమి అనంతరం అభిమానుల కోపానికి గురవుతానని భయపడ్డానని తెలిపాడు. కానీ ప్రజలు తమను బాగా ఆడామని ప్రశంసించడంతో ఊపిరి పీల్చుకున్నామని అన్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 2024లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 7) ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ (మధ్యాహ్నం 3:30).. లక్నో-గుజరాత్‌ (రాత్రి 7:30) తలపడుతున్నాయి. 
 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)