Breaking News

కింద పడ్డ రోహిత్‌ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

Published on Wed, 06/03/2026 - 15:44

టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఈ వీడియోలో రోహిత్‌ నడుస్తూ బ్యాలెన్స్‌ కోల్పోయి నేలపై ముందుకు పడ్డాడు. ఈ వీడియో ఇప్పటిదా లేక పాతదా అన్న విషయంపై క్లారిటీ లేనప్పటికీ.. రోహిత్‌ అభిమానులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. తమ ఆరాధ్య ఆటగాడు ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అని గాబరా పడుతున్నారు.

రోహిత్‌ త్వరలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. అతడు టెస్ట్‌, టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించి టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్‌ తాజాగా ముగిసిన ఐపీఎల్‌ 2026లో హ్యామ్‌స్ట్రింగ్‌ గాయంతో పలు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అయితే ఆడిన మ్యాచ్‌ల్లో మాత్రం తనదైన క్లాస్‌ను ప్రదర్శించి మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడాడు.

కాగా, ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు రోహిత్‌తో పాటు విరాట్‌ కోహ్లి కూడా ఎంపికయ్యాడు. అతడు కూడా రోహిత్‌లాగే టెస్ట్‌, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పి, కేవలం​ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌ 2026లో రోహిత్‌తో పోలిస్తే విరాట్‌ చాలా మెరుగ్గా ఆడాడు. వరుసగా రెండో ఎడిషన్‌లో తన జట్టు ఛాంపియన్‌గా నిలపడంలో ప్రధానపాత్ర పోషించాడు. గుజరాత్‌తో జరిగిన ఫైనల్స్‌లో అజేయమైన అర్ద సెంచరీతో తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు.

రోహిత్‌, విరాట్‌ 2027 వన్డే ప్రపంచకప్‌ దృష్ట్యా అంతర్జాతీయ వన్డేల్లో కొనసాగుతున్నారు. ఆ సమయం వరకు ఫామ్‌లో ఉండి, ఫిట్‌నెస్‌ కాపాడుకుంటూ ఉంటేనే జట్టులో ఉంటారని సెలెక్టర్లకు వారిద్దరికి ఖరాకండిగా చెప్పారు. ఈ మేరకే రో-కో అడుగులు వేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే మ్యాచ్‌లు జూన్‌ 13, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగనున్నాయి.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)