Breaking News

'ఈసారి కప్‌ మనదే'.. రోహిత్‌ శర్మ సిగ్నల్‌!

Published on Fri, 05/26/2023 - 20:28

ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్‌ అత్యంత విజయమవంతమైన జట్టు. ఐదుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన ఘనత ఆ జట్టు సొంతం. ఇప్పటివరకు ఫైనల్లో అడుగుపెట్టిన ఆరు సందర్భాల్లో ఐదుసార్లు టైటిల్‌ను గెలిచి కానీ వెళ్లలేదు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌ ఫైనల్‌ చేరుకోవడానికి మరో అడుగు దూరంలో ఉంది.

శుక్రవారం గుజరాత్‌ టైటాన్స్‌తో క్వాలిఫయర్‌-2లో గెలిస్తే ఏడోసారి ఫైనల్‌లో అడుగుపెట్టనుంది. అయితే గతంలో ముంబై ఇండియన్స్‌ ఆరుసార్లు ఫైనల్‌ చేరిన సందర్భాల్లో ఒక్కసారి మినహా మిగతా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఒకవేళ ఈసారి ఫైనల్‌కు వస్తే మాత్రం ముంబై ఆరోసారి విజేతగా నిలవడం గ్యారంటీ అని ఆ జట్టు అభిమానులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌తో క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌కు ముందు రోహిత్‌ శర్మ చేసిన నెంబర్‌ సిగ్నల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌ ఆడేందుకు హోటల్‌ రూం నుంచి బస్‌లో బయలుదేరిన సమయంలో.. ముంబై కెప్టెన్‌ రోహిత్‌ బస్సు కిటికీలోనుంచి అభిమానులను చూస్తూ ఆరు సంఖ్యను సిగ్నల్‌గా చూపిస్తూ ఈసారి కప్‌ మనదే అన్నట్లుగా సైగ చేశాడు.  రోహిత్‌ అలా చూపించగానే ముంబై ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోయారు. 

ఈ సీజన్‌లో తొలి అంచె పోటీల్లో ఎనిమిది మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మాత్రమే గెలిచి అసలు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తుందా అన్న అనుమానం కలిగింది. కానీ రెండో అంచె పోటీల్లో ముంబైకి ఎక్కడలేని బలం వస్తోంది. ఏ జట్టైనా ఆది నుంచి ఓటమలు ఎదురైతే డీలా పడడం చూస్తాం. కానీ ముంబై అలా కాదు.. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని రెండో అంచె పోటీల్లో వరుస విజయాలు సాధించి ఒక్కసారిగా ప్లేఆఫ్‌ రేసులోకి వచ్చింది. ఆర్‌సీబీ లక్నో చేతిలో ఓడిపోవడం.. అదే సమయంలో ముంబై ఎస్‌ఆర్‌హెచ్‌పై గెలవడంతో నాలుగో జట్టుగా ప్లేఆఫ్‌లో అడుగుపెట్టింది.

ఇక ఎలిమినేటర్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ను 81 పరుగుల తేడాతో చిత్తు చేసి భారీ విజయాన్ని దక్కించుకొని క్వాలిఫయర్‌-2కు చేరుకుంది. అయితే క్వాలిఫయర్-2లో గుజరాత్‌ను ఓడించి ఫైనల్‌కు వచ్చిందా కప్‌ కొట్టకుండా మాత్రం పోదు. గత రికార్డులు కూడా అవే చెబుతున్నాయి. చూద్దాం మరి ముంబై ఇండియన్స్‌ ఆరోసారి కప్‌ కొడుతుందో లేదో..

చదవండి: వర్షం వల్ల మ్యాచ్‌ రద్దయితే ఫైనల్‌కు వెళ్లేదెవరంటే?

Videos

Jawan Murali Naik Family: వైఎస్ జగన్ పరామర్శ

ఆపరేషన్ సిందూర్ లో ఎయిర్ ఫోర్స్ కీలక పాత్రపై ప్రధాని హర్షం

శ్రీకాకుళం జిల్లా కొరాఠి ఫీల్డ్ అసిస్టెంట్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు

సుప్రీంలో MP మిథున్‌రెడ్డికి ఊరట

పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాది హతం

పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదం నలుగురు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

బాగేపల్లి టోల్ గేట్ వద్ద వైఎస్ జగన్ కు ఘనస్వాగతం

Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే పోలీసులు కూటమి అరాచకాలపై సజ్జల ఫైర్

ప్రయాణికులకు ఇండిగో, ఎయిరిండియా అలర్ట్

Photos

+5

ఏపీలో ప్రసిద్ధ వాడపల్లి.. 7 శనివారాల వెంకన్న ఆలయం.. మీరు ఎప్పుడైనా వెళ్ళారా (ఫొటోలు)

+5

ఖరీదైన ఇల్లు కొన్న 'అనసూయ'.. గృహ ప్రవేశం ఫోటోలు చూశారా?

+5

విజయవాడ : అన్నమాచార్యులు జయంతి సందర్భంగా.. నృత్య సమ్మోహనం (ఫొటోలు)

+5

Miss World 2025: నాగార్జున సాగర్‌ బుద్ధవనంలో ప్రపంచ సుందరీమణులు (ఫొటోలు)

+5

పెళ్లయి 13 ఏళ్లు.. భర్తతో హీరోయిన్ స్నేహ ఇలా (ఫొటోలు)

+5

గంగమ్మ జాతరలో మంచు మనోజ్ దంపతులు (ఫొటోలు)

+5

మదర్స్‌ డే స్పెషల్.. అమ్మలతో సెలబ్రిటీల పోజులు (ఫొటోలు)

+5

లండన్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహం.. తొలి నటుడిగా రికార్డ్ (ఫొటోలు)

+5

నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

తిరుపతి: గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు (ఫొటోలు)