చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ.. తిరుగులేని హిట్‌మ్యాన్‌

Published on Mon, 02/10/2025 - 09:24

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌(Sachin Tendulkar)ను అధిగమించాడు. ఇంగ్లండ్‌తో రెండో వన్డే(India vs England) సందర్భంగా ఈ ఘనత సాధించాడు. అదే విధంగా.. ఈ మ్యాచ్‌లో శతక్కొట్టడం ద్వారా మరిన్ని రికార్డులను హిట్‌మ్యాన్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

అద్భుత ఇన్నింగ్స్‌
కాగా రోహిత్‌ శర్మ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో విమర్శలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెస్టుల్లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దారుణంగా విఫలమైన అతడు రిటైర్‌ అయిపోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఇంగ్లండ్‌తో కటక్‌ వన్డేలో తనదైన శైలిలో విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడి.. విమర్శించినవాళ్లే ప్రశంసించేలా రోహిత్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

వన్డే కెరీర్‌లోనే రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీ
బరాబతి స్టేడియంలో లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు రోహిత్‌ శర్మ. ఫ్లడ్‌లైట్ల సమస్య కారణంగా కాసేపు అవాంతరాలు ఎదురైనా.. అతడి ఏకాగ్రత చెదరలేదు. ఒంటిమీదకు బాణాల్లా దూసుకువస్తున్న ఇంగ్లండ్‌ ఫాస్ట్‌బౌలర్ల బంతులను సమర్థవంతంగా ఎదుర్కొన్న రోహిత్‌ శర్మ తన వన్డే కెరీర్‌లోనే రెండో ఫాస్టెస్ట్‌ సెంచరీని నమోదు చేశాడు.

డెబ్బై ఆరు బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌లో ఏకంగా పన్నెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అయితే, లియామ్‌ లివింగ్‌స్టోన్‌ బౌలింగ్‌లో ఆదిల్‌ రషీద్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో హిట్‌మ్యాన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా రోహిత్‌ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా నిలిచాడు. మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ ఇప్పటి వరకు 15404 పరుగులు చేశాడు. తద్వారా సచిన్‌ టెండుల్కర్‌ను అధిగమించాడు.

కాగా ఓపెనర్‌గా సచిన్‌ టెండుల్కర్‌ 15335 పరుగులు చేశాడు. మరోవైపు.. ఈ జాబితాలో విధ్వంసకర మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ 15758 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడి తర్వాతి స్థానంలోకి ఇప్పుడు రోహిత్‌ దూసుకువచ్చాడు. కాగా 2007లో అరంగేట్రం చేసిన రోహిత్‌.. 2013లో ఓపెనర్‌గా ప్రమోట్‌ అయ్యాడు.

ద్రవిడ్‌ను అధిగమించి
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ల జాబితాలో రోహిత్‌ శర్మ (267 వన్డేల్లో 10,987 పరుగులు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటి వరకు నాలుగో స్థానంలో ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌ (344 వన్డేల్లో 10,889 పరుగులు) ఐదో స్థానానికి చేరాడు. టాప్‌–3లో సచిన్‌ టెండూల్కర్‌ (463 వన్డేల్లో 18,246 పరుగులు), విరాట్‌ కోహ్లి (296 వన్డేల్లో 13,911 పరుగులు), సౌరవ్‌ గంగూలీ (311 వన్డేల్లో 11,363 పరుగులు) ఉన్నారు.

32వ శతకం
వన్డేల్లో రోహిత్‌ శర్మ సెంచరీలు 32. తద్వారా అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో రోహిత్‌ మూడో స్థానంలో ఉన్నాడు. టాప్‌–2లో విరాట్‌ కోహ్లి (50), సచిన్‌ టెండూల్కర్‌ (49) ఉన్నారు.

ఇక ఈ మ్యాచ్‌ విషయానికొస్తే.. కటక్‌లో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు బట్లర్‌ బృందం ఆలౌట్‌ అయింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రోహిత్‌ సేన 44.3 ఓవర్లలోనే పనిపూర్తి చేసింది. 

ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసిన భారత్‌.. నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య నామమాత్రపు మూడో వన్డే అహ్మదాబాద్‌ వేదికగా బుధవారం జరుగుతుంది.

చదవండి: జట్టు కోసం కొన్ని పరుగులు చేశా.. అతడొక క్లాసీ ప్లేయర్‌: రోహిత్‌ శర్మ

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)