Breaking News

'యాక్సిడెంట్‌ నాకు రెండో లైఫ్‌'.. 'డేట్‌ ఆఫ్‌ బర్త్‌' మార్చుకున్న పంత్‌

Published on Wed, 06/28/2023 - 18:38

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గతేడాది డిసెంబర్‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.  పలు సర్జరీల అనంతరం ఎన్‌సీఏలో రీహాబిలిటేషన్‌లో ఉన్న పంత్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు ఎలాగైనా జట్టులో చోటు సంపాదించాలని పంత్‌ ప్రయత్నిస్తున్నాడు.

ఇటీవలే స్టెప్స్‌ ఎక్కుతున్న వీడియోను షేర్‌ చేసిన పంత్‌ పెద్దగా ఇబ్బంది పడినట్లు అనిపించలేదు. అంతేకాదు ఇటీవలే టీమిండియా క్రికెటర్స్‌ పలువురు పంత్‌ను కలిశారు. ఆ ఫోటోలను కూడా పంత్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇక కారు యాక్సిడెంట్‌లో ప్రాణాల నుంచి బయటపడిన పంత్‌కు ఇది నిజంగా రెండో జీవితమని చాలా మంది అభిమానులు అభిప్రాయపడ్డారు.

తాజాగా పంత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ను గమనిస్తే అతని బయోడేటాలో  డేట్‌ ఆఫ్‌ బర్త్‌ మారినట్లు కనిపిస్తుంది. వాస్తవానికి 25 ఏళ్ల పంత్‌ జన్మదినం అక్టోబర్‌ 4, 1997. బయోడేటా ఎలా ఉందంటే.. 
రిషబ్‌ పంత్‌
అథ్లెట్‌
ఇండియా
సెకండ్‌ D.O.B-: 05/01/2023 అని రాసి ఉంది.

పంత్‌ కారు ప్రమాదానికి గురైంది డిసెంబర్‌ 30, 2022 రోజున.కానీ తొలి ఆరు రోజులు పంత్‌ ఆరోగ్య పరిస్థితి డేంజర్‌లోనే ఉంది. జనవరి 5వ తేదీన పంత్‌ పూర్తిగా డేంజర్‌ నుంచి బయటపడ్డాడు.  అందుకే పంత్‌.. జనవరి 5, 2023ను తనకు రెండో డేట్‌ ఆఫ్‌ బర్త్‌గా పరిగణించి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌డేట్‌ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంత్‌ తన డేట్‌ ఆఫ్‌ బర్త్‌ను మార్చుకోవడం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

చదవండి: #Bairstow: పిచ్‌ మీదకు దూసుకొచ్చే యత్నం.. ఎత్తిపడేసిన బెయిర్‌ స్టో

బాల్‌గర్ల్‌గా బ్రిటన్‌ యువరాణి.. మెళుకువలు నేర్పిన ఫెదరర్‌

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)