Breaking News

సెంచరీతో కదంతొక్కిన రింకూ సింగ్‌

Published on Sun, 10/11/2026 - 17:41

రంజీ ట్రోఫీ 2026-27లో ఉత్తర్‌ప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా ఆటగాడు రింకూ సింగ్‌ సెంచరీతో కదంతొక్కాడు. బిహార్‌తో ఇవాళ మొదలైన ఎలైట్‌ గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తుండగా.. రింకూ తొలి రోజే మూడంకెల మార్కును తాకాడు. 164 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

మరో యూపీ ఆటగాడు మాధవ్‌ కౌశిక్‌ (124 నాటౌట్‌) అజేయ సెంచరీతో రింకూకు జతగా క్రీజ్‌లో ఉన్నాడు. తొలి రోజు ఆట ​ముగిసే సమయానికి యూపీ స్కోర్‌ 3 వికెట్ల నష్టానికి 287గా ఉంది. అభిషేక్‌ గోస్వామి (13), కెప్టెన్‌ ఆర్మన్‌ జుయల్‌ (13), కరణ్‌ శర్మ (13) ఔటయ్యారు. బిహార్‌ బౌలర్లలో సూరజ్‌ కశ్యప్‌ 2, అమోద్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

కాగా, రింకూ ప్రస్తుతం ఏ ఫార్మాట్‌లోనూ భారత జట్టులో లేడు. కొద్ది రోజుల కిందట టీ20 జట్టులో స్థానం కోల్పోయిన అతడు రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్యలో దేశవాలీ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. ముఖ్యంగా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో రింకూ చాపకింద నీరులా ప్రవహిస్తున్నాడు. 

ఈ ఫార్మాట్‌లో అతడు 77 ఇన్నింగ్స్‌ల్లో 10 సెంచరీలు, 23 హాఫ్‌ సెంచరీలు బాదాడు. తాజా ప్రదర్శనలతో రింకూ మరోసారి భారత సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించాడు. రింకూ ప్రస్తుతం భారత-ఏ జట్టులోనూ స్థానానికి నోచుకోలేదు. త్వరలో న్యూజిలాండ్‌లో పర్యటించబోయే ఏ జట్టులో కూడా రింకూకు చోటు దక్కలేదు. ​

ఇదీ చదవండి: రీఎంట్రీలో సూర్యకుమార్‌ అట్టర్‌ ప్లాప్‌


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)