Breaking News

టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే! స్టార్ ప్లేయ‌ర్‌కు నో ఛాన్స్‌?

Published on Fri, 12/19/2025 - 12:43

టీ20 ప్రపంచకప్‌-2026కు భారత జట్టును బీసీసీఐ శనివారం(డిసెంబర్ 20) ప్రకటించనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సమావేశం కానున్నారు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అగార్కర్ జట్టును ప్రకటించనున్నాడు. ఈ మెగా టోర్నీకి భార‌త్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య‌మివ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. 

ఫిబ్ర‌వ‌రి 7 నుంచి ఈ పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ గ్రూపు-ఎలో టీమిండియా ఉంది. టీమిండియాతో పాటు పాకిస్తాన్‌, యూఎస్ఎ, న‌మీబియా, నెద‌ర్లాండ్స్ ఉన్నాయి. ఈ మెగా ఈవెంట్‌కు ముందు భార‌త్ ఇంకా 6 టీ20 మ్యాచ్‌లు ఆడింది. సౌతాఫ్రికాతో ఒక్క మ్యాచ్‌.. కివీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది.  ఈ సిరీస్ ముగిశాక మెన్ ఇన్ బ్లూ నేరుగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అడుగుపెట్ట‌నుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భార‌త్‌.. త‌మ తొలి మ్యాచ్‌లో ఫిబ్ర‌వ‌రి 7న యూఏఈతో త‌ల‌ప‌డ‌నుంది.

ఇక ఇది ఇలా ఉండ‌గా.. ఈ మెగా టోర్నీ కోసం భార‌త జ‌ట్టును మాజీ ఓపెన‌ర్, కామెంటేట‌ర్‌ ఆకాశ్ చోప్రా ఎంపిక చేశాడు. ఓపెన‌ర్లుగా అభిషేక్ శ‌ర్మ‌, శుభ్‌మ‌న్ గిల్‌ను చోప్రా ఎంపిక చేశాడు. అదేవిధంగా మిడిలార్డ‌ర్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్‌, తిల‌క్ వ‌ర్మ‌ల‌కు అత‌డు చోటిచ్చాడు. వికెట్ కీప‌ర్ల‌గా సంజూ శాంస‌న్‌, జితేష్ శ‌ర్మలు ఉన్నారు. 

ఆల్‌రౌండ‌ర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌ల‌కు అవ‌కాశం ద‌క్కింది. స్పెష‌లిస్టు స్పిన్న‌ర్ల‌గా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌ల‌ను ఎంపిక చేయ‌గా.. ఫాస్ట్ బౌల‌ర్ల‌గా  జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు ఉన్నారు. అయితే చోప్రా ఎంపిక చేసిన జ‌ట్టులో స్టార్ ఫినిష‌ర్ రింకూ సింగ్‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌కు కూడా రింకూను ఎంపిక చేయ‌లేదు.
చదవండి: IPL 2026: 'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)