Breaking News

ప్లాన్‌ అదిరింది.. మెస్సీ రిటైర్మెంట్‌ అప్పుడే!

Published on Fri, 07/24/2026 - 13:15

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గ‌జం లియోన‌ల్ మెస్సీ రిటైర్మెంట్‌పై ఒక స్ప‌ష్టత వ‌చ్చింది. అర్జెంటీనా జ‌ట్టులో స్థిర‌త్వం వ‌చ్చే వ‌ర‌కు తాను జ‌ట్టులో కొన‌సాగుతాన‌ని, ఆ త‌ర్వాత కెరీర్‌కు వీడ్కోలు ప‌ల‌క‌నున్న‌ట్లు మెస్సీ త‌న అభిప్రాయాన్ని అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేష‌న్ (ఏఎఫ్ఏ)కు వెల్ల‌డించిన‌ట్లు ప‌లు నివేదిక‌లు పేర్కొంటున్నాయి. 

దీంతో 2030 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌కు తాను అందుబాటులో ఉండ‌న‌ని మెస్సీనే ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చేశాడు. రాబోయే నాలుగేళ్ల‌లో మెస్సీతో పాటు జ‌ట్టులో ఉన్న సీనియ‌ర్ ఆట‌గాళ్లంతా కెరీర్‌కు గుడ్‌బై చెప్పే యోచ‌న‌లో ఉన్నారు. దీంతో జ‌ట్టులో సీనియ‌ర్లంతా ఒకేసారి రిటైర్ అయితే ఆ ప్ర‌భావం యువ ఆట‌గాళ్ల‌పై ఎక్కువ‌గా ఉంటుంద‌ని అర్జెంటీనా ఫుట్‌బాల్ తెలిపింది. 

అందుకోసం మెస్సీని కొంత‌కాలం పాటు జ‌ట్టుతో కొన‌సాగాల‌ని అతడితో తెలిపినట్లు సమాచారం. దీనికి మెస్సీ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక మెస్సీ వీడ్కోలు మ్యాచ్‌ను కూడా ఘ‌నంగా ప్లాన్ చేసిన‌ట్లు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేష‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. త్వరలోనే ఆ వివరాలు బయటికి వెల్లడిస్తామని అర్జెంటీనా ఫుట్‌బాల్‌ తెలిపింది.

ఇక 2026 ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ 39 ఏళ్ల వయసులోనూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 8 గోల్స్ చేయడంతో పాటు 4 అసిస్ట్‌లతో టోర్నీలో రెండో అత్యధిక గోల్ స్కోరర్‌గా నిలిచి సిల్వర్ బూట్ అందుకున్నాడు. 10వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగిన మెస్సీ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు. 

ఫిఫా చరిత్రలో అత్యధిక గోల్స్ కొట్టిన ఆటగాడిగా మెస్సీ (21 గోల్స్‌) రెండో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో ఎంబాపె (ఫ్రాన్స్‌, 22 గోల్స్‌) ఉన్నాడు. ఇక రెండు దశాబ్దాల కెరీర్‌లో 2014 ఫిఫా ఫైనల్లో అర్జెంటీనా ఓటమి తర్వాత మెస్సీ ఆటకు వీడ్కోలు పలకాలనుకున్నాడు. కానీ చిన్న వయసు కావడంతో ఆలోచనను విరమించుకున్న మెస్సీ ఆ తర్వాత అర్జెంటీనాకు అద్భుత విజయాలు అందించాడు. 

2021 కోపా అమెరికా కప్‌తో పాటు 2022 ఫిఫా ప్రపంచకప్‌ను అందించి అర్జెంటీనా ఖాతాలో మూడో ఫిఫా టైటిల్‌ను చేర్చాడు. 2024 కోపా అమెరికా కప్‌ను మరోసారి గెలిచిన అర్జెంటీనా 2026 ఫిఫాలో ఫైనల్ చేరినప్పటికీ తుదిమెట్టుపై బోల్తా కొట్టింది. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)