Breaking News

క్లబ్‌ మేనేజర్‌తో గొడవ..  పీఎస్‌జీని వీడనున్నాడా?

Published on Sun, 03/19/2023 - 11:02

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ త్వరలోనే పారిస​్‌ సెయింట్‌ జెర్మెన్‌(PSG Club) వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పీఎస్‌జీ క్లబ్‌ మేనేజర్‌ క్రిస్టొఫీ గాల్టియర్‌తో గొడవలే ఇందుకు కారణమని తెలుస్తోంది. మేనేజర్‌తో గొడవ కారణంగా మెస్సీ పీఎస్‌జీ క్లబ్‌ కొనసాగేందుకు ఇష్టంగా లేడని.. త్వరలోనే తెగదెంపులు చేసుకునే అవకాశం ఉందని డెయిలీ మెయిల్‌ తన కథనంలో పేర్కొంది.

శనివారం పీఎస్‌జీ  క్లబ్‌ నిర్వహించిన ట్రెయినింగ్‌ సెషన్‌కు మెస్సీ హాజరుకాలేదని.. గాల్టియర్‌తో పొసగకనే మెస్సీ తన హాటల్‌ రూంకే పరిమితమయ్యాడని తెలిపింది.  మేనేజర్‌తో మెస్సీకి పొసగడం లేదన్న వార్తలు నిజమేనని మెస్సీ తండ్రి పేర్కొనడంతో ఈ వార్తలకు మరింత ఊతమిచ్చినట్లయింది.

కాగా మెస్సీ 2021లో పీఎస్‌జీతో రెండేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఏడాది జూన్‌తో మెస్సీకి పీఎస్‌జీతో కాంట్రాక్ట్‌ ముగియనుంది. మేనేజర్‌తో గొడవ కారణంగా మెస్సీ తన కాంట్రాక్ట్‌ను రెన్యువల్‌ చేసుకుంటాడా లేక బయటికి వస్తాడా అనేది ఆసక్తికంగా మారింది. అంతకముందు 2004 నుంచి 2021 వరకు 17 ఏళ్ల పాటు మెస్సీ స్పానిష్‌ క్లబ్‌ బార్సిలోనాకు ఆడాడు. ఒకవేళ పీఎస్‌జీ నుంచి బయటికి వస్తే మెస్సీ కచ్చితంగా మళ్లీ బార్సిలోనా గూటికే చేరే అవకాశం ఉంది.

అయితే మెస్సీ పీఎస్‌జీ వీడనున్నట్లు వస్తున్న వార్తలకు మరో కారణం ఉంది. ఫ్రాన్స్‌ స్టార్‌ కైలియన్‌ ఎంబాపెతో మెస్సీ రిలేషన్‌ అంతగా బాగా లేదని.. ఇద్దరు స్టార్స్‌ ఒకేచోట ఇమడలేకపోతున్నారంటూ సమాచారం. ఖతర్‌ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌ తర్వాత వీరిద్దరి మధ్య రిలేషిన్‌షిప్‌ దెబ్బ తిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే పీఎస్‌జీలోకి వచ్చిన తర్వాత మెస్సీ ప్రయాణం అనుకున్నంత గొప్పగా ఏమి సాగడం లేదు. దీంతో అతను బయటికి రావడానికి ఇది కూడా ఒక కారణమని కొంతమంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

చదవండి: ప్రపంచ పొట్టి బాడీబిల్డర్‌ వివాహం.. వీడియో వైరల్‌

వయసు పెరిగినా వన్నె తగ్గలేదు..

Videos

పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ

గరం ఛాయ్ సెలబ్రేషన్స్

మాపై కక్ష ఉంటే తీర్చుకోండి.. కానీ 18వేల మంది కుటుంబాలను రోడ్డున పడేయకండి..

ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై

Big Question: అరెస్టులు తప్ప ఆధారాలు లేవు.. మద్యం కేసు మటాష్

కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను దీటుగా ఎదుర్కొందాం: YS జగన్

ఇవాళ ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్ ప్రెస్ మీట్...

అమెరికా గోల్డెన్ డోమ్.. అంతరిక్షంలో ఆయుధాలు

మావోయిస్ట్ పార్టీని ఊచకోత కోస్తోన్న ఆపరేషన్ కగార్

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

Photos

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)