Breaking News

రూ. 30 లక్షలతో రిటైన్‌.. కట్‌ చేస్తే! ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్‌ డబుల్‌ సెంచరీ

Published on Tue, 11/18/2025 - 10:50

రంజీ ట్రోఫీ 2025/26 సీజన్‌లో కర్ణాటక స్టార్ బ్యాటర్  స్మరణ్ రవిచంద్రన్  అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. హుబ్లీ వేదికగా చండీగఢ్‌తో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్‌లో రవిచంద్రన్ అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. స్మరణ్ 362 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో 227 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఇది అతడికి రెండో ద్విశతకం కావడం గమనార్హం. 

అంతకుముందు కేరళతో జరిగిన మ్యాచ్‌లోనూ డబుల్ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా స్మరణ్‌కు ఇది మూడో ఫస్ట్ క్లాస్  డబుల్ సెంచరీ. ఈ మ్యాచ్‌లోనే అత‌డు 1,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఫీట్‌ను కేవలం 13  ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలోనే సాధించడం విశేషం.

ర‌విచంద్ర‌న్ డ‌బుల్ సెంచ‌రీ ఫ‌లితంగా క‌ర్ణాట‌క తమ తొలి ఇన్నింగ్స్‌ను 547/8 భారీ స్కోర్‌ వద్ద డిక్లేర్‌ చేసింది. స్మరణ్‌తో పాటు కరుణ్‌ నాయర్‌(95), శ్రేయస్‌ గోపాల్‌(62), శిఖర్‌ శెట్టి(59) హాఫ్‌ సెంచరీలతో రాణించారు. చండీఘడ్‌ బౌలలర్లలో జగజీత్‌ సింగ్‌, విషు తలా రెండు వికెట్లు సాధించారు.

ఎస్‌ఆర్‌హెచ్‌లో స్మరణ్‌..
ఐపీఎల్‌లో స్మరణ్ రవిచంద్రన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.. గత సీజన్‌లో గాయపడిన ఆడమ్ జంపా స్థానంలో స్మరణ్‌ను ఎస్‌ఆర్‌హెచ్ తమ జట్టులోకి తీసుకుంది. అతని బేస్ ధర రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే ప్రా​‍క్టీస్ సెషన్‌లో స్మరణ్ గాయపడడంతో సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. అతడి స్దానంలో హర్ష్ దూబేకి అవకాశం దక్కింది. అయితే ఐపీఎల్‌-2026 మినీ వేలానికి ముందు సన్‌రైజర్స్ అతడిని రిటైన్ చేసుకుంది.
చదవండి: 'ఏమి చేయాలో అత‌డికి తెలుసు.. మధ్యలో నీ జోక్యమెందుకు'

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)