Breaking News

ఓ పక్క అన్న.. మరో పక్క తమ్ముడు.. రఫ్ఫాడిస్తున్న ఖాన్‌ బ్రదర్స్‌

Published on Fri, 02/23/2024 - 15:56

ప్రస్తుతం భారత క్రికెట్‌లో రెండు పేర్లు మార్మోగిపోతున్నాయి. ఏ ఇద్దరు కలిసినా ముంబై ఆటగాళ్లు, అన్నదమ్ములు సర్ఫరాజ్‌ ఖాన్‌, ముషీర్‌ ఖాన్‌ గురించి చర్చించుకుంటున్నారు. ఈ ఖాన్‌ బ్రదర్స్‌ ప్రపంచ క్రికెట్‌లోనూ హాట్‌ టాపిక్‌గా మారారు.

వచ్చీ రాగానే ఇరగదీసిన సర్ఫరాజ్‌..
దేశవాలీ క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్‌ రికార్డు కలిగి అభినవ బ్రాడ్‌మన్‌గా కీర్తించబడిన సర్ఫరాజ్‌ ఖాన్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చీ రాగానే తనదైన మార్కును చూపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రాజ్‌కోట్‌ టెస్ట్‌తో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌.. తొలి మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్‌ సెంచరీలు చేసి టీమిండియా భవిష్యత్తు సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. 

సంచలనాల ముషీర్‌..
సర్ఫరాజ్‌ తమ్ముడు ముషీర్‌ ఖాన్‌ విషయానికొస్తే.. 18 ఏళ్ల ఈ కుడి చేతి వాటం బ్యాటర్‌ అన్న అడుగుజాడల్లోనే నడుస్తూ అద్భుతాలు చేస్తున్నాడు. ఇటీవల ముగిసిన అండర్‌ 19 వరల్డ్‌కప్‌లో సెంచరీల మోత  మోగించి, పరుగుల వరద (7 మ్యాచ​్‌ల్లో 2 సెంచరీలు, హాఫ్‌ సెంచరీ సాయంతో 360 పరుగులు) పారించిన ముషీర్‌.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ క్వార్టర్‌ ఫైనల్లో ముంబై తరఫున బరిలోకి దిగి అద్భుతమైన సెంచరీతో ఇరగదీశాడు. 

శివమ్‌ దూబే, శ్రేయస్‌ అయ్యర్‌ తప్పుకోవడంతో చివరి నిమిషంలో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ముషీర్‌.. బరోడాతో జరుగుతున్న మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగి సెంచరీతో మెరిశాడు. ఈ సెంచరీని ముషీర్‌ 179 బంతుల్లో పూర్తి చేశాడు. ముషీర్‌ సెంచరీతో కదంతొక్కడంతో ముంబై సేఫ్‌ జోన్‌లోకి వచ్చింది. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది.  

ఎందుకంత హైప్‌..
క్రికెట్‌లో అన్నదమ్ములు కలిసి ఆడటం, ఇద్దరూ అద్భుతంగా రాణించడం వంటి ఘటనలు గతంలో చాలా సందర్భాల్లో చూశాం​. అయితే ఈ ఖాన్‌ బ్రదర్స్‌ పరిస్థితి ఇందుకు భిన్నం. ఎందుకంటే సర్ఫరాజ్‌, ముషీర్‌లకు ఈ స్థాయి గుర్తింపు రావడానికి వెనుక చాలా కష్టం దాగి ఉంది. సర్ఫరాజ్‌, ముషీర్‌ల తండ్రి నౌషద్‌ ఖాన్‌ పేదరికంతో పోరాడి ఈ ఇద్దరి కెరీర్‌ల కోసం జీవితాన్నే త్యాగం చేశాడు.

సర్ఫరాజ్‌ టీమిండియా తరఫున అరంగ్రేటం చేశాక నౌషద్‌ ఖాన్‌ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తన కొడుకు ఈ స్థాయికి చేరడం వెనుక కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)