Breaking News

చరిత్ర సృష్టించిన రాహుల్‌ చాహర్‌.. 166 ఏళ్ల పురాతన రికార్డు బద్దలు

Published on Sun, 09/28/2025 - 19:13

భారత ఔట్‌ డేటెడ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ (Rahul Chahar) ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌లో తన తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌ 2025లో (County Championship) సర్రే (Surrey) తరఫున అరంగేట్రంలోనే 10 వికెట్లు (హ్యాంప్‌షైర్‌పై) తీసి, 1859లో నమోదైన 166 ఏళ్ల పురాతన రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌ చాహర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 2, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు తీశాడు.

119 ఏళ్ల సర్రే కౌంటీ చరిత్రలో తొలి మ్యాచ్‌లోనే 8 వికెట్ల ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గానూ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 1859లో విలియన్‌ ముడీ నార్త్‌పై తన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. హ్యాంప్‌షైర్‌తో మ్యాచ్‌లో 118 పరుగులిచ్చి 10 వికెట్లు తీసిన చాహర్‌.. తన ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో తొలిసారి 10 వికెట్ల ఘనత సాధించడంతో పాటు అత్యుత్తమ గణాంకాలను కూడా నమోదు చేశాడు.

చాహర్‌ అద్భుత ప్రదర్శనతో చెలరేగడంతో హ్యాంప్‌షైర్‌పై సర్రే 20 పరుగుల తేడాతో గెలుపొందింది. 181 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో చాహర్‌ (24-7-51-8) రెచ్చిపోయాడు. రెండు వికెట్లు మినహా హ్యాంప్‌షైర్‌ మొత్తాన్ని కూల్చేశాడు. ఈ మ్యాచ్‌లో చాహర్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో సహచర భారత ఆటగాడు వాషింగ్టన్‌ సుందర్‌ను ఔట్‌ చేయడం​ విశేషం. ఈ సీజన్‌లో సుందర్‌ హ్యాంప్‌షైర్‌కు ఆడుతున్నాడు.

2021 టీ20 వరల్డ్‌ కప్‌లో చివరిసారి టీమిండియాకు ఆడిన చాహర్‌.. భారత్‌ తరఫున ఓ వన్డే, 6 టీ20లు ఆడాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో రెగ్యులర్‌గా ఆడుతున్న చాహర్‌.. 2019, 2020 సీజన్లలో ముంబై ఇండియన్స్‌ టైటిల్‌ విన్నింగ్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ సహా పంజాబ్‌ కింగ్స్‌, రైజింగ్‌ పూణే సూపర్‌ జెయింట్స్‌కు ఆడిన చాహర్‌.. ప్రస్తుతం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. 

చదవండి: అనూహ్య నిర్ణయం.. కెప్టెన్‌గా ఇషాన్‌ కిషన్‌

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి