Breaking News

IPL 2026: శ్రేయస్‌ అయ్యర్‌ టీమ్‌లో కీలక చేరిక

Published on Thu, 10/23/2025 - 16:30

ఐపీఎల్‌ 2026 (IPL 2026) సీజన్‌కు ముందు గత సీజన్‌ రన్నరప్‌ పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) కీలక నిర్ణయం తీసుకుంది. సునీల్‌ జోషి (2023-2025) స్థానంలో భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులేను (Sairaj Bahutule) కొత్త స్పిన్ బౌలింగ్‌ కోచ్‌గా నియమించింది. 

బహుతులే ఇటీవలే రాజస్థాన్‌ రాయల్స్‌ స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌ పదని నుంచి వైదొలిగాడు. తదుపరి సీజన్‌లో బహుతులే రికీ పాంటింగ్‌ (హెడ్‌ కోచ్‌) నేతృత్వంలోని కోచింగ్‌ బృందంలో చేరతాడు. ఈ టీమ్‌లో బ్రాడ్‌ హడ్డిన్‌, జేమ్స్‌ హోప్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌లుగా ఉన్నారు. 

బహుతులే చేరిక శ్రేయస్‌ (Shreyas Iyer) బృందానికి అదనపు బలాన్ని ఇస్తుందని పంజాబ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తుంది. 51 ఏళ్ల బహుతులేకు దేశవాలీ క్రికెట్‌లో ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. అతను బెంగాల్‌, కేరళ, విదర్భ, గుజరాత్‌ జట్లకు కోచింగ్‌ను అందించాడు. భారత యువ బౌలర్లను తీర్చిదిద్దడంలో సాయిరాజ్‌ది అందవేసిన చెయ్యిగా చెబుతారు.

సాయిరాజ్‌ చేరికపై పంజాబ్‌ కింగ్స్‌ సీఈవో సతీష్‌ మీనన్‌ స్పందించాడు. అతని మాటల్లో.. "ముందుగా సునీల్ జోషికి కృతజ్ఞతలు. ఇప్పుడు బహుతులే చేరడం మాకు గర్వకారణం. అతని అనుభవం, వ్యూహాత్మక దృష్టి మా జట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది".

పంజాబ్‌ కింగ్స్‌తో డీల్‌ ఖరారయ్యాక సాయిరాజ్‌ కూడా స్పందించాడు. పంజాబ్ కింగ్స్‌లో చేరడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ జట్టు ప్రత్యేకమైన క్రికెట్ ఆడుతుంది. యువ ప్రతిభను మెరుగుపరచడంలో నా పాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు. 

కాగా, పంజాబ్‌ కింగ్స్‌ గత సీజన్‌ ఫైనల్లో ఆర్సీబీ చేతిలో ఓటమిపాలై తృటిలో టైటిల్‌ను చేజార్చుకుంది. శ్రేయస్‌ అయ్యర్‌ గత సీజన్‌లోనే పంజాబ్‌ కింగ్స్‌ పగ్గాలు చేపట్టి అద్భుతంగా ముందుండి నడిపించాడు. వ్యక్తిగతంగానూ రాణించాడు. శ్రేయస్‌ అంతకుముందు సీజన్‌లో (2024) కేకేఆర్‌కు విజేతగా నిలిపిన విషయం తెలిసిందే. గత సీజన్‌ వేలంలో శ్రేయస్‌ను పంజాబ్‌ యాజమాన్యం రికార్డు ధర వెచ్చించి సొంతం చేసుకుంది.

చదవండి: NZ VS ENG: సిరీస్‌ ఇంగ్లండ్‌ వశం.. ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌గా బ్రూక్‌

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)