Breaking News

అందుకే సర్ఫరాజ్‌పై వేటు!.. రీఎంట్రీకి అతడు అర్హుడు: పుజారా

Published on Mon, 05/26/2025 - 10:29

ఐపీఎల్‌-2025 తర్వాత టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటన (India vs England)తో బిజీకానుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTC) 2025-27 సీజన్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి సిరీస్‌ జరుగునుంది. ఇందుకు సంబంధించి శనివారమే భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించింది.

వారికి గ్రీన్‌ సిగ్నల్‌
పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన బృందానికి యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఇంగ్లండ్‌తో టెస్టులతో సారథిగా అతడి ప్రయాణం మొదలుకానుంది. ఇక ఈ జట్టులో సాయి సుదర్శన్‌, అభిమన్యు ఈశ్వరన్‌ చోటు దక్కించుకోగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా తొలిసారి టెస్టు టీమ్‌లోకి వచ్చాడు. 

కరుణ్‌ రీ ఎంట్రీ
చాలా ఏళ్ల తర్వాత ‘ట్రిపుల్‌ సెంచూరియన్‌’ కరుణ్‌ నాయర్‌కు కూడా అవకాశం దక్కింది. మరోవైపు.. శార్దూల్‌ ఠాకూర్‌ కూడా పునరాగమనం చేశాడు. అయితే, సర్ఫరాజ్‌ ఖాన్‌కు మాత్రం సెలక్టర్లు ఇంగ్లండ్‌తో టెస్టులు ఆడే జట్టులో చోటివ్వలేదు. ఈ పరిణామాలపై టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ ఛతేశ్వర్‌ పుజారా స్పందించాడు. 

అందుకే సర్ఫరాజ్‌పై వేటు!
‘‘ఆసియా, ఉపఖండ పిచ్‌లపై సర్ఫరాజ్‌ ఖాన్‌ విజయవంతమైన ఆటగాడిగా ఉన్నాడు. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో అతడు రాణించలేడని సెలక్టర్లు భావించి ఉండవచ్చు. అందుకే.. అతడికి ఈ జట్టులో చోటు ఇవ్వలేదనుకుంటా. 

అంతేకాదు.. అతడికి ఫిట్‌నెస్‌ సమస్యలు ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం సర్ఫరాజ్‌ ఫిట్‌నెస్‌ గురించి నాకైతే సమాచారం లేదు. ఫిట్‌గా ఉండేందుకు అతడు అన్ని రకాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నాడని మాత్రం తెలుసు.

రీఎంట్రీకి అతడు అర్హుడు
ఏదేమైనా దురదృష్టవశాత్తూ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, కరుణ్‌ నాయర్‌ ఎంపిక పట్ల సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతున్న అతడు జట్టులో చోటుకు అర్హుడు’’ అని పుజారా హిందుస్తాన్‌ టైమ్స్‌తో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. 

కాగా టీమిండియా చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఆడింది. ఈ టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్‌ ఎంపికైనా ఒక్క మ్యాచ్‌ కూడా అడే అవకాశం రాలేదు.

ఇక టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య జూన్‌ 20 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది. కాగా దేశవాళీ క్రికెట్‌తో పాటు కౌంటీల్లోనూ రాణిస్తున్న పుజారా సైతం టెస్టు జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే, అతడి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.

ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టు
శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, అభిమన్యు ఈశ్వరన్‌, కరుణ్‌ నాయర్‌, నితీశ్‌ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్‌ జురెల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ, ఆకాశ్‌ దీప్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌.

చదవండి: కోపంతో ఊగిపోయిన సిరాజ్‌.. ఇదేంటి మియా?.. అతడి పట్ల ఇలాగేనా ప్రవర్తించేది?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)