ఆసీస్‌కు షాకిచ్చిన ముజరబానీకి బంపరాఫర్‌!

Published on Sun, 02/15/2026 - 13:38

ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించిన జింబాబ్వే బౌలర్‌ బ్లెసింగ్‌ ముజరబానీకి బంపరాఫర్‌ వచ్చింది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL)లో వెస్టిండీస్‌ స్టార్‌ పేసర్‌ షమార్‌ జోసెఫ్‌ స్థానాన్ని ముజరబానీ భర్తీ చేయనున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా పూర్తైనట్లు తెలుస్తోంది.

 షమార్‌ జోసెఫ్‌పై వేటు
కాగా మార్చి 26న పాక్‌ సూపర్‌ లీగ్‌ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ తమ జట్టులో కీలక మార్పు చేసింది. రూ. 1.1 కోట్లకు (పాక్‌ కరెన్సీలో) కొనుగోలు చేసి షమార్‌ జోసెఫ్‌పై వేటు వేసింది. ఈ విండీస్‌ పేసర్‌ స్థానంలో జింబాబ్వే స్టార్‌ ముజరబానీని చేర్చుకుంది. అయితే, టెక్నికల్‌ కమిటీ నుంచి ఇందుకు ఆమోదం లభించాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. షమార్‌ జోసెఫ్‌ను జట్టు నుంచి తొలగించడం పట్ల ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ నోరు విప్పలేదు. అటు జోసెఫ్‌ సైతం మౌనంగానే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల పరస్పర అంగీకారంతోనే అతడు తప్పుకొన్నట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో పేర్కొంది.

కారణం అదేనా?
కాగా 2024లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసి..  సత్తా చాటిన షమార్‌ జోసెఫ్‌ వ్యక్తిగత ప్రవర్తనతో చిక్కుల్లో పడ్డాడు. అతడి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో  ఇస్లామాబాద్‌ యునైటెడ్‌కు షమార్‌ ఆడటాన్ని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీ అతడితో బంధం తెంచుకోవడం గమనార్హం.

ఆస్ట్రేలియా బ్యాటర్లను వణికించిన ముజరబానీ
ఇక జింబాబ్వే రైటార్మ్‌ పేసర్‌ బ్లెసింగ్‌ ముజరబానీకి పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ కొత్తేమీ కాదు. 2021లో టైటిల్‌ గెలిచిన జట్టులో అతడు సభ్యుడు. అయితే, గత కొంతకాలంగా అతడు పేలవ ప్రదర్శనతో సతమతమయ్యాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీతో ముజరబానీ తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.

ముఖ్యంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ముజరబానీ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 17 పరుగులే ఇచ్చి.. నాలుగు వికెట్లు కూల్చాడు. జోష్‌ ఇంగ్లిస్‌ (8), టిమ్‌ డేవిడ్‌ (0), మ్యాట్‌ రెన్షా (65), ఆడం జంపా (2) వికెట్లు తన ఖాతాలో వేసుకుని జింబాబ్వే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఆసీస్‌పై గెలిచిన జింబాబ్వే.. 2007 తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత రెండోసారి కంగారూ జట్టును ఓడించింది.

చదవండి: IND vs PAK: ‘​వర్షం పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)