Breaking News

పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్‌ సెంచరీ

Published on Mon, 10/27/2025 - 11:56

వివాదాస్పద బ్యాటర్‌ పృథ్వీ షా (Prithvi Shaw) రంజీ ట్రోఫీలో (Ranji Trophy) మహారాష్ట్ర (Maharashtra) తరఫున తన తొలి సెంచరీ సాధించాడు. 2025-26 ఎడిషన్‌లో భాగంగా చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (రెండో ఇన్నింగ్స్‌) కేవలం 72 బంతుల్లోనే (13 ఫోర్ల సాయంతో) శతక్కొట్టాడు. 

రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది ఆరో వేగవంతమైన శతకం. తొలి ఐదు ఫాస్టెస్ట్‌ సెంచరీలు రిషబ్‌ పంత్‌ (48), రాజేశ్‌ బోరా (56), రియన్‌ పరాగ్‌ (56), రూబెన్‌ పాల్‌ (60), రజత్‌ పాటిదార్‌ (68) పేరిట ఉన్నాయి. రంజీ మహారాష్ట్ర తరఫున ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ. షాకు ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఇది 14వ సెంచరీ. 

ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పుంజుకుని సెంచరీ సాధించాడు. మహారాష్ట్ర తరఫున రంజీ అరంగేట్రాన్ని (ఈ ఎడిషన్‌ తొలి మ్యాచ్‌) డకౌట్‌తో ప్రారంభించిన షా (కేరళపై).. రెండో ఇన్నింగ్స్‌లో 75 పరుగులతో రాణించాడు.

ప్రస్తుత రంజీ సీజన్‌ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. కొత్త జట్టు తరఫున అదరగొడుతున్నాడు. ముంబైతో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో 181 పరుగులు.. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్‌ఘడ్‌పై 111 పరుగులు చేశాడు. వరుస సెంచరీలతో షా మరోసారి టీమిండియావైపు దూసుకొస్తున్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ (116) సెంచరీతో కదంతొక్కడంతో మహారాష్ట్ర 313 పరుగులు చేసింది. అనంతరం విక్కీ ఓస్త్వాల్‌ (21-6-40-6) ఆరేయడంతో చంఢీఘడ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌటైంది. రమన్‌ బిష్ణోయ్‌ (54), పదో నంబర్‌ ఆటగాడు నిషంక్‌ బిర్లా (56 నాటౌట్‌) చండీఘడ్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించారు.

104 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన మహారాష్ట్ర, మూడో రోజు తొలి సెషన్‌ సమయానికి వికెట్‌ నష్టానికి 164 పరుగులు చేసి, 268 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. షా 105, సిద్దేశ్‌ వీర​ 28 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

చదవండి: IND vs AUS T20 Series: తొలి పంజా మనదే..!

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)