Breaking News

CWG 2026: ఫైన‌ల్లో ప్రీతి.. బాక్సింగ్‌లో ప‌త‌కం ఖాయం

Published on Fri, 07/31/2026 - 16:03

కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో భార‌త మ‌హిళా బాక్స‌ర్ ప్రీతి ప‌వార్ దేశానికి ప‌త‌కం ఖాయం చేసింది. సెమీస్ చేరిన‌ప్పుడే ప‌త‌కం ఖాయ‌మైన‌ప్ప‌టికీ తాజాగా మ‌హిళ‌ల 54 కేజీల విభాగంలో ప్రపంచ మూడో ర్యాంకర్‌ ప్రీతి ప‌వార్ ఫైన‌ల్లో అడుగుపెట్ట‌డంతో భార‌త్ ఖాతాలో స్వ‌ర్ణం లేదా ర‌జ‌తం ఖ‌రారు కానుంది. శుక్ర‌వారం మ‌హిళ‌ల 54 కేజీల విభాగంలో సెమీఫైన‌ల్లో ప్రీతి ప‌వార్ 5-0తో జాంబియాకు చెందిన కేథ‌రిన్ వేప్‌ను చిత్తుగా ఓడించి ఫైన‌ల్‌కు చేరుకుంది. 

స్వ‌ర్ణ ప‌త‌కం కోసం జ‌రిగే పోరులో కెన‌డాకు చెందిన స్కార్లెట్ డెల్గాడోతో త‌ల‌ప‌డ‌నుంది. ఫైన‌ల్లో ప్రీతి ఓడినప్ప‌టికీ భార‌త్‌కు ర‌జ‌తం ద‌క్క‌నుంది. హ‌ర్యానాలోని భివానీకి చెందిన ప్రీతి ప‌వార్ 2022 ఆసియా గేమ్స్‌లో కాంస్య ప‌త‌కాన్ని గెలుచుకుంది. సెమీస్‌లో విజయం తర్వాత ప్రీతి ప‌వార్ మాట్లాడుతూ.."నేను అనుకున్నది సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. 

స్వర్ణ పతకం గెలవడానికి రేపు నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలి. నేను నా పోటీదారులను ఎప్పుడూ తక్కువ అంచనా వేయను. కామ‌న్‌వెల్త్ గేమ్స్‌లో నా ప్ర‌తీ ఫైట్‌కు ముందు కోచ్‌తో ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్ర‌త్యేకంగా సన్నద్ధమవుతాను. ఆ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయగ‌లుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది.'' అని ప్రీతి ప‌వార్ తెలిపింది.

జూడో క్వార్ట‌ర్స్‌లో భార‌త ప్లేయ‌ర్లు
జూడోలో రోహిత్ బ‌సిర్, శ్ర‌ద్ధా చొపాడేలు క్వార్ట‌ర్ ఫైన‌ల్లో అడుగుపెట్టారు. మొజాంబిక్‌కు చెందిన సామ్యూల్ రిబెరియోను ఇప్పోన్ ద్వారా ఓడించి క్వార్ట‌ర్స్ బెర్తును ఖ‌రారు చేసుకున్నాడు. మ‌రోవైపు జేన్ మ‌సాక్వియోను ఇప్పోన్‌లో ఓడించిన శ్ర‌ద్ధా కూడా  క్వార్ట‌ర్స్ చేరుకుంది.
 

Read: క్యాచ్‌ మిస్‌ కొంపముంచింది.. జట్టును గెలిపించిన జెమీమా!

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)