Breaking News

బిగ్‌ అనౌన్స్‌మెంట్‌..!

Published on Wed, 06/10/2026 - 14:43

భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చని భావిస్తున్న ఓ ప్రతిపాదన ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫ్రాంచైజీ టి20 లీగ్ అయిన బిగ్‌బాష్‌ లీగ్‌ మ్యాచ్‌లను తొలిసారిగా భారత్‌లో నిర్వహించే దిశగా ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన నిజమైతే, ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది ఓ కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.

ఈ ప్రణాళికలో భాగంగా చెన్నై నగరం ప్రధాన వేదికగా పరిశీలనలో ఉన్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఐకానిక్ క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన చిదంబరం స్టేడియంను ఓ ప్రత్యేక బీబీఎల్‌ రెగ్యులర్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వడానికి అనుకూలమైన వేదికగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై గత కొన్ని నెలలుగా క్రికెట్ ఆస్ట్రేలియా , బీసీసీఐ మరియు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌ మధ్య అనధికారిక చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.

తాజాగా ఈ అంశానికి అధిక ప్రాధాన్యత లభించడానికి కారణం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారని వస్తున్న వార్తలు. ఆ పర్యటనలో మోదీ బిగ్‌బాష్‌ లీగ్‌ భారత ఎంట్రీపై  "గ్రౌండ్ బ్రేకింగ్" ప్రకటన చేస్తారని అంతర్జాతీయ  నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్‌ సంబంధాలపై పలు సానుకూల ప్రకటనలు చేస్తారని సమాచారం.

ఒకవేళ బిగ్‌బాష్‌ లీగ్‌ భారత ఎంట్రీ ప్రాజెక్ట్ సాకారమైతే, అంతర్జాతీయ టీ20 లీగ్‌లు పరస్పర దేశాల్లో మ్యాచ్‌లు నిర్వహించే కొత్త ట్రెండ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ ప్రతిపాదనకు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌లలో పాల్గొనడంపై ఉన్న పరిమితులు, ఐపీఎల్ షెడ్యూల్‌తో సర్దుబాటు, ప్రసార హక్కుల పంపకం, లాజిస్టిక్స్ వంటి అంశాలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)