తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు
Breaking News
PKL 2022: ప్రొ కబడ్డీ లీగ్ మొదటి దశ షెడ్యూల్ విడుదల! వేదికలు, ఇతర వివరాలు
Published on Wed, 09/21/2022 - 15:59
Pro Kabaddi League 2022 Schedule And Other Details: కబడ్డీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్)- 2022 వచ్చే నెల(అక్టోబరు)లో ఆరంభం కానుంది. ఇందుకు సంబంధించి పీకేఎల్ సీజన్ 9 తొలి దశ షెడ్యూల్‌ను లీగ్ నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు లీగ్ నిర్వాహక సంస్థ మాషల్ స్పోర్ట్స్ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఆ రెండు జట్ల మధ్య మ్యాచ్‌తో లీగ్ ఆరంభం
డిఫెండింగ్ చాంపియన్ దబాంగ్ ఢిల్లీ కేసీ, యు ముంబా మధ్య మ్యాచ్‌తో అక్టోబరు 7 పీకేఎల్ సీజన్ 9కు తెరలేవనుంది. అదే రోజు బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో యూపీ యోధాస్ తలపడనున్నాయి.
మొదటి దశలో భాగంగా అక్టోబరు 7 నుంచి నవంబరు 8 వరకు 66 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ షెడ్యూల్‌లో లీగ్‌లో పాల్గొనే ప్రతి జట్టూ ఇతర జట్లతో పోటీపడుతుంది.



అంతకు మించిన వినోదం
ఇక వీవో పీకేఎల్ సీజన్ 9 తొలి దశ షెడ్యూల్ విడుదల నేపథ్యంలో మాషల్ స్పోర్ట్స్ హెడ్, లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ.. బెంగళూరు, పుణె, హైదరాబాద్ వేదికగా మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. గత సీజన్‌కు మించిన వినోదంతో కబడ్డీ అభిమానుల ముందుకు వస్తున్నామని.. సరికొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ చేస్తామని పేర్కొన్నారు.
లైవ్‌స్ట్రీమింగ్ ఎక్కడంటే..
వివో ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-9ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ+హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
టికెట్లు ఎలా?
పీకేఎల్-2022 టికెట్లను బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చు.
చదవండి: Ind Vs Aus 1st T20: పాండ్యా భావోద్వేగం! పాక్‌తో మ్యాచ్‌లోనూ ఓడిపోవాలంటూ నటి ట్వీట్! మీ వాళ్లేదో పొడిచేసినట్టు?!
Rohit Vs Dinesh Karthik: దినేశ్ కార్తిక్‌పై రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్
Tags : 1