Breaking News

పాకిస్తాన్‌ కాదు, యూఏఈ కాదు, శ్రీలంక కాదు.. కొత్త ప్రదేశంలో ఆసియా కప్‌-2023..?

Published on Sat, 05/13/2023 - 18:51

ఆసియా కప్‌-2023 ఆతిధ్యం విషయమై గతకొద్ది రోజులుగా ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరని విషయం తెలిసిందే. షెడ్యూల్‌ ప్రకారం ఈ మెగా టోర్నీ పాకిస్తాన్‌లో జరగాల్సి ఉండగా.. భద్రతా కారణాల రిత్యా భారత్‌.. పాక్‌లో అడుగుపెట్టేది లేదని తెగేసి చెప్పింది. దీంతో మరో ఆప్షన్‌ లేని పాక్‌.. టీమిండియా ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై (యూఏఈ) నిర్వహిస్తామని ప్రతిపాదిస్తూనే, వన్డే ప్రపంచకప్‌ కోసం తాము కూడా భారత్‌లో పర్యటించమని మెలిక పెట్టింది. తాము భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే, టీమిండియా సైతం పాక్‌లో ఆసియా కప్‌ మ్యాచ్‌లు ఆడాలని ప్రకటించింది.

ఈ మధ్యలో ఏసీసీ మిగతా సభ్య దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్‌లు.. యూఏఈలో ఆసియా కప్‌ జరిగే సమయానికి ఎండలు అధికంగా ఉంటాయని, అందుకే తాము యూఏఈలో అడుగపెట్టమని ప్రకటించాయి. ఈ సందిగ్థ పరిస్థితుల్లో పీసీబీ చీఫ్‌ నజమ్‌ సేథి సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. ఆతిథ్య హక్కులు తమవే కాబట్టి, వేదికను ఎంచుకునే అధికారం తమకే ఉంటుందని చెబుతూ.. ఆసియాకప్‌-2023ను పాక్‌, యూఏఈ, శ్రీలంకల్లో కాకుండా ఇంగ్లండ్‌లో నిర్వహిస్తే బాగుంటుందని అన్నాడు. పీసీబీ బాస్‌ సరికొత్త ప్రతిపాదనపై ఏసీసీ సభ్య దేశాలు ఏరకంగా స్పందిస్తాయో వేచి చూడాలి.

చదవండి:  పాక్‌ క్రికెట్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు