Breaking News

'పెళ్లి, హానీమూన్ అన్నాడు.. అందుకే అతడిని వదిలేశాము'

Published on Fri, 12/19/2025 - 09:18

ఐపీఎల్‌-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్‌పై కాసుల వర్షం కురిసింది. కేవలం నాలుగు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని తెలిసినప్పటికీ.. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ. 8.6 కోట్ల  భారీ ధరకు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

ఇంగ్లిష్ కోసం లక్నోతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా తీవ్రంగా శ్రమించింది. కాగా ఇంగ్లిస్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకోబోతున్నాడు. ఈ కారణంగా అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండనని, కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడుతానని ముందుగానే ప్రకటించాడు. దీంతో పంజాబ్ కింగ్స్ అతడిని రిటైన్ చేసుకోకుండా వేలంలోకి విడిచిపెట్టింది.

హనీమూన్ వాయిదా?
అయితే ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవడంతో కేవలం నాలుగు మ్యాచ్‌ల ఆడాలన్న తన నిర్ణయాన్ని ఇంగ్లిష్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 18న వివాహం తర్వాత వెంటనే హనీమూన్‌కు వెళ్లాలనుకున్న ప్లాన్‌ను వాయిదా వేసి..నేరుగా లక్నో క్యాంప్‌లో చేరాలని అతను భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయిన‌ప్పటికి అత‌డు ఐపీఎల్ ఆరంభ‌ మ్యాచ్‌ల‌కు దూర‌మయ్యే అవ‌కాశముంది. ఇదే విష‌యంపై పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ నెస్ వాడియా స్పందించారు. ఇంగ్లిష్ తీరును అత‌డు త‌ప్పుబ‌ట్టాడు.

"మేము జోష్ ఇంగ్లిష్‌ను రిటైన్ చేసుకోవాల‌నుకున్నాము. కానీ అత‌డు రిటెన్షన్ గడువు ముగియడానికి కేవలం 45 నిమిషాల ముందు తన వ్యక్తిగత కారణాల గురించి తెలియ‌జేశాడు. త‌న పెళ్లి, హానీమూన్ కార‌ణంగా కేవ‌లం మూడు మ్యాచ్‌ల‌కే మాత్ర‌మే అందుబాటులో ఉంటాన‌ని చెప్పాడు. 

అందుకే అత‌డిని వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. ఇది ఏమాత్రం ప్రొఫెషన్‌లిజం కాదు. కానీ నేను అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అతడు అద్భుతమైన ఆటగాడు. ఆస్ట్రేలియా తరపున కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. మరి ఇప్పుడు ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడుతాడో  లేదో చూద్దం" అని వాడియా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా ఐపీఎల్‌-2025 మెగా వేలంలో ఇంగ్లిష్‌ను రూ. 2.60 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ కొనుగొలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం అతడు చేశాడు. 11 మ్యాచ్‌లు ఆడి 162.57 స్ట్రైక్ రేట్‌తో 278 పరుగులు చేశాడు. అయితే ఇప్పుడు అతడు ఏకంగా రూ.8.60 కోట్లు అందుకోనున్నాడు. అంటే దాదాపు 230.77% పెరుగుదల అనే చెప్పాలి.
చదవండి: ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌.. క‌ట్ చేస్తే! అక్క‌డ డ‌బుల్ సెంచ‌రీతో

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)