Breaking News

చరిత్ర సృష్టించిన నిసాంక.. శ్రీలంక తొలి ప్లేయర్‌గా..

Published on Tue, 09/16/2025 - 19:25

ఆసియా కప్‌-2025 టోర్నమెంట్లో శ్రీలంక వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్‌-బిలో ఉన్న లంక జట్టు తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అయితే, రెండో మ్యాచ్‌లో భాగంగా పసికూన హాంకాంగ్‌తో తలపడిన శ్రీలంక (SL vs HK).. గెలుపు కోసం ఆపసోపాలు పడింది.

దుబాయ్‌ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హాంకాంగ్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 149 పరుగుల మేర మెరుగైన స్కోరు సాధించింది.

నిజాకత్‌ ఖాన్‌ మెరుపులు
ఓపెనర్లు జీషన్‌ అలీ (23), అన్షుమాన్‌ రథ్‌ (48) శుభారంభం అందించగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ నిజాకత్‌ ఖాన్‌ అజేయ మెరుపు అర్ధ శతకం (38 బంతుల్లో 52)తో అలరించాడు. అయితే, హాంకాంగ్‌ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు శ్రీలంక గట్టిగానే శ్రమించాల్సి వచ్చింది.

హాంకాంగ్‌ బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ 11, కమిల్‌ మిశారా 19, కుశాల్‌ పెరీరా 20 పరుగులు చేయగా.. కెప్టెన్‌ చరిత్‌ అసలంక (2), కమిందు మెండిస్‌ (5) పూర్తిగా విఫలమయ్యారు.

పాతుమ్‌ నిసాంక హాఫ్‌ సెంచరీ
అయితే, ఓవైపు వికెట్లు పడుతున్నా మరో ఓపెనర్‌ పాతుమ్‌ నిసాంక మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని ఆరు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. నిసాంక అర్ధ శతకానికి తోడు ఆఖర్లో వనిందు హసరంగ (9 బంతుల్లో 29 నాటౌట్‌) మెరుపులు మెరిపించడంతో లంక గట్టెక్కగలిగింది.

శ్రీలంక తొలి ప్లేయర్‌గా..
ఇక శ్రీలంక విజయంలో ​కీలక పాత్ర పోషించిన పాతుమ్‌ నిసాంకకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. అంతేకాదు ఈ మ్యాచ్‌ సందర్భంగా నిసాంక ఓ అరుదైన రికార్డు కూడా సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో శ్రీలంక తరఫున అత్యధిక ఫిఫ్టీ ప్లస్‌ స్కోర్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

కాగా అంతకు ముందు ఈ రికార్డు కుశాల్‌ మెండిస్‌ పేరిట ఉండేది. అతడి ఖాతాలో 16 ఫిఫ్టీ ప్లస్‌ టీ20 స్కోర్లు ఉండగా.. నిసాంక (17) అతడిని అధిగమించాడు. ఇదిలా ఉంటే కుశాల్‌ పెరీరా కూడా 16సార్లు యాభైకి పైగా స్కోర్లు సాధించి కుశాల్‌ మెండిస్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

శ్రీలంక వర్సెస్‌ హాంకాంగ్‌ స్కోర్లు
👉హాంకాంగ్‌:149/4 (20)
👉శ్రీలంక: 153/6 (18.5)
👉ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో హాంకాంగ్‌పై శ్రీలంక గెలుపు.

చదవండి: ఒకప్పుడు ‘చిరుత’.. ఇప్పుడు మెట్లు ఎక్కాలన్నా ఆయాసమే!

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)