కమిన్స్‌ రీఎంట్రీ.. యాషెస్‌ హీరోకు మొండిచేయి!

Published on Tue, 07/21/2026 - 12:22

బంగ్లాదేశ్‌తో స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 13 మందితో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది. కెప్టెన్ పాట్ క‌మిన్స్‌తో పాటు సీనియ‌ర్లు జోష్ హాజిల్‌వుడ్‌, స్పిన్న‌ర్ నాథ‌న్ లియోన్‌ రీఎంట్రీ ఇవ్వ‌నుండ‌గా, 2025-26 యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా గెల‌వ‌డంలో కీల‌క‌పాత్ర పోషించిన మైకెల్ నెస‌ర్‌ను తుది జ‌ట్టు నుంచి త‌ప్పించారు. 

ఆగ‌స్టు 13 నుంచి 17 వ‌ర‌కు డార్విన్ వేదిక‌గా తొలి టెస్టు, మాకే వేదిక‌గా ఆగ‌స్టు 22 నుంచి 26 వ‌ర‌కు రెండో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. 13 మందితో కూడిన జ‌ట్టులో ఆరుగురు స్పెష‌లిస్ట్ బ్యాట‌ర్లు, ఇద్ద‌రు ఆల్‌రౌండ‌ర్లు, ఐదుగురు ఫాస్ట్‌ బౌల‌ర్లు, ఒక స్పిన్న‌ర్ ఉన్నారు.ఇక గ‌తేడాది యాషెస్ సిరీస్ సంద‌ర్భంగా తొలి టెస్టు అనంత‌రం వెన్నునొప్పి కార‌ణంగా రెగ్యుల‌ర్ కెప్టెన్ పాట్ క‌మిన్స్ మిగిలిన మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యాడు.

ఇక కండ‌రాల గాయంతో జోష్ హాజిల్‌వుడ్ కూడా యాషెస్ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. జ‌ట్టు స్పెష‌లిస్ట్ స్పిన్న‌ర్‌గా నాథ‌న్ లియోన్ మ‌రోసారి జ‌ట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. క‌మిన్స్ గైర్హాజ‌రీలోనూ గ‌తేడాది సొంత‌గ‌డ్డ‌పై యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1తో నెగ్గింది. ఈ సిరీస్‌లో మైకెల్ నెస‌ర్ రాణించాడు. 

మూడు మ్యాచ్‌లు క‌లిపి 15 వికెట్లు తీయ‌డ‌మే గాక‌, చివ‌రి రెండు టెస్టుల్లో బ్యాట్‌తోనూ రాణించాడు. అయితే క‌మిన్స్‌, హాజిల్‌వుడ్ జ‌ట్టులోకి రావ‌డంతో నెస‌ర్‌ను జ‌ట్టు త‌ప్పించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.  ఇప్ప‌టికే 2027 ఐసీసీ టెస్టు చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధ‌మ‌వుతున్న ఆస్ట్రేలియా వ‌చ్చే సీజ‌న్ (2027-2029) సైకిల్లోనూ ఫైన‌ల్ చేరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది. త‌ర్వాతి 12 నెలల్లో ఆస్ట్రేలియా మొత్తం 21 టెస్టు మ్యాచ్‌లు ఆడ‌నుంది.

ఆస్ట్రేలియా జ‌ట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ (వికెట్‌ కీపర్‌), కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్‌ కీపర్‌), మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, జేక్ వెదరాల్డ్, బ్యూ వెబ్‌స్టర్

Read: దేశవాళీ క్రికెట్‌లో కొత్త రూల్స్‌.. తస్మాత్‌ జాగ్రత్త!

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)